అక్కినేని నాగార్జున కెరియర్ లో మన్మధుడు ఎంత సూపర్ హిట్ సినిమానో అందరికి తెలిసిందే.ఈ సినిమాలో త్రివిక్రమ్ కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది.
మన్మధుడు సినిమాలో పారిస్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని హీరో టర్న్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సిద్ధం చేసాడు.
ఆ కథతో ఇప్పటికే నాగార్జునని కూడా ఒప్పించాడు.ఇక ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ సెలక్షన్ ని రాహుల్ రవీంద్రన ల్ చేసే పనిలో వున్నాడు.
ఇందులో ఒక హీరోయిన్ గా ఇప్పటికే ఆర్ ఎక్స్ భామ పాయల్ రాజ్ పుత్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా వుంటే తాజాగా టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన టాక్ కూడా వినిపిస్తుంది.
ఇందులో ఇంకో హీరోయిన్ కి అవకాశం వుందని, అయితే అది పూర్తి స్థాయి క్యారెక్టర్ కాకున్నా దానికి ఓ సీనియర్ హీరోయిన్ అయితే బాగుంటుందని రాహుల్ ఫిక్స్ అయ్యి అనుష్కని సంప్రదించినట్లు తెలుస్తుంది.ఇక తనని హీరోయిన్ గా పరిచయం చేసి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడుగా వున్నా నాగార్జునకి జోడీగా అనేసరికి అనుష్క ఎం ఆలోచించకుండా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని వచ్చే నెలలో అధికారికంగా స్టార్ట్ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తుంది.అయితే మన్మధుడు సీక్వెల్ గా ఈ కొత్త సినిమాని తెరకెక్కిస్తున్న రాహుల్ తన కథనంతో మన్మధుడు సినిమాని ఫీట్ ని ఎ మాత్రం అందుకోగలడు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.