ఆరు షోలు.. రూ.135 రూపాయల హైక్.. ఏపీలో దేవర టికెట్ రేట్లు భారీ పెరిగాయిగా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) దేవర మూవీకి( Devara Movie ) టికెట్ రేట్ల పెంపు ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలకు చెక్ పడింది.ఏపీ ప్రభుత్వం దేవర సినిమాకు టికెట్ రేట్లను( Devara Ticket Rates ) భారీ స్థాయిలో పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.

 Andhra Pradesh Devara Movie Ticket Rates Hike Details, Andhra Pradesh, Cm Chandr-TeluguStop.com

రిలీజ్ రోజున ఆరు షోలు, ఆ తర్వాత 9 రోజులు 5 షోలు, 14 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేలా ఏపీ సర్కార్ అనుమతులు ఇవ్వడం కొసమెరుపు.పెంచిన టికెట్ రేట్లు దేవరకు కలెక్షన్ల పరంగా ప్లస్ కానున్నాయి.

ఈ నెల 18వ తేదీన నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకోగా ఈ నెల 20వ తేదీన అనుమతులు వచ్చాయని తెలుస్తోంది.మరోవైపు దేవర టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చినందుకు తారక్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,( CM Chandrababu Naidu ) డిప్యూటీ సీఎం పవన్ లకు( Deputy CM Pawan Kalyan ) ధన్యవాదాలు తెలియజేశారు.

తెలుగు సినిమాకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరవలేనిదని తారక్ వెల్లడించారు.

Telugu Andhra Pradesh, Cm Chandrababu, Devara Advance, Devara, Devaraticket, Jan

సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ కు రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తారక్ చెప్పుకొచ్చారు.అప్పర్ క్లాస్ 110 రూపాయల వరకు, లోవర్ క్లాస్ 60 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతులు లభించాయి.ఈ మధ్య కాలంలో కల్కి సినిమాకు మాత్రమే ఈ స్థాయిలో పెంపు దక్కింది.

టాలీవుడ్ సినిమాలకు మేలు జరిగేలా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది.

Telugu Andhra Pradesh, Cm Chandrababu, Devara Advance, Devara, Devaraticket, Jan

తెలంగాణ ప్రభుత్వం కూడా దేవర సినిమా టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.నిర్మాత దిల్ రాజు నైజాం ఏరియాలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ఈ నెల 23వ తేదీ నుంచి ఏపీలో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube