అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.డెమొక్రాట్ పార్టీ నుంచి కమలా హారిస్ ,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ఎన్నికల్లో పోటీపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికాలో పోలింగ్ మొదలైంది.అదేంటీ అక్కడ అధ్యక్ష ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న కదా , రెండు నెలల ముందే ఎన్నికలు ఏంటీ అనే డౌట్ మీకు రావొచ్చు.
అదే అమెరికా స్టైల్.ఈ వివరాల్లోకి వెళితే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం అనే ఓటింగ్ విధానాలున్నాయి.మళ్లీ ఈ ముందుస్తులోనూ రెండు పద్ధతులను పెట్టారు అమెరికా రాజ్యాంగకర్తలు.
ఒకటి ముందుగానే నిర్దేశించిన పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేయడం, లేదా పోస్ట్ ద్వారా పంపించడం.ఈ నెల 11 నుంచే అలబామా రాష్ట్రం( Alabama ) పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రారంభించింది.
ఆ వెంటనే 19న విస్కాన్సిన్,( Visconsin ) 20న మిన్నెసోటాలు( Minnesota ) ప్రారంభించాయి.
వచ్చే నెల 21న టెక్సాస్‌లో ముందస్తు ఓటింగ్ ప్రారంభం కానుంది.ఈసారి ఏకంగా 47 రాష్ట్రాలు ముందస్తు ఓటింగ్‌కు వెసులుబాటు కల్పించాయి.మేరీలాండ్, ఫ్లోరిడా, మసాచుసెట్స్, కనెక్టికట్ రాష్ట్రాలు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
మిస్సిస్పిపి, న్యూహాంప్‌షైర్, అలబామా రాష్ట్రాలలో ముందస్తు ఓటింగ్ లేదు.అమెరికా పౌరులే , 18 ఏళ్లు నిండిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
అమెరికా అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.యూఎస్ కాంగ్రెస్‌ను ప్రతినిధుల సభ (435 మంది), సెనేట్ (34 మంది)గా విభజించారు.ఆయా స్థానాలకు కూడా అభ్యర్ధులు పోటీపడుతున్నారు.ప్రతి రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉంటాయి.ఇవి మొత్తం 538.ఇందులో కనీసం 270 లేదా అంతకుమించి సాధించిన వారే అధ్యక్షుడిగా గెలిచినట్లు.మరి కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు ఈసారి ప్రెసిడెంట్‌గా గెలుస్తారో.