తెలుగు మీద మేల్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా మళ్లీ గ్యాప్ ఇచ్చాడు.రెండేళ్ల క్రితం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా( 30 Rojullo Preminchadam Ela ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రదీప్.
ఆ సినిమాతో తొలి సినిమానే హిట్ అందుకున్నాడు.ఆ సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా సినిమాలు కొనసాగిస్తాడని అనుకోగా సినిమాలు మానేసి మళ్లీ తన యాంకరింగ్ ప్రొఫెషన్ నే కొనసాగిస్తున్నాడు ప్రదీప్.
సినిమాల కన్నా ఈ షోలే బెటర్ అని ప్రదీప్( Pradeep ) డిసైడ్ అయినట్టు ఉన్నాడు.అందుకే ఫుల్ టైం యాంకర్ గా పార్ట్ టైం హీరోగా చేయాలని ఫిక్స్ అయ్యాడట.అయితే ఈమధ్య సినిమా చేయాలని కొంత ఆసక్తి చూపించినా సరైన కథ( Story ) దొరక్క పోవడంతో ప్రదీప్ ఇక సినిమాలు చేయాలన్న ఆలోచన కూడా విరమించుకున్నాడని తెలుస్తుంది.ప్రదీప్ ని ఇక హీరోగా చూడటం కష్టమని టాక్.
అయితే ప్రదీప్ ఫ్యాన్స్ మాత్రం అతన్ని మళ్లీ హీరోగా చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు.మరి ప్రదీప్ వారి కోసమైనా సినిమాలు చేస్తాడేమో చూడాలి.
అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ స్టోరీస్ తో ప్రదీప్ ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు.