మొబైల్ ఫోన్‌ వల్ల లాభం చూపించిన మహీంద్రా ఓనర్

మనలో చాలా మంది మొబైల్ ఫోన్‌లో మొహం పెట్టి గంటల సమయం వృథా చేస్తుంటాం.అయితే ఇంట్లో తల్లిదండ్రులకు ఇది నచ్చకపోవడంతో చివాట్లు కూడా తప్పవు.

 Anand Mahindra Tweets About Benefits Of Mobile Phone-TeluguStop.com

పరీక్షల సమయంలో ఫోన్ మనకు అందుబాటులో లేకుండా వారు జాగ్రత్త పడుతుంటారు.అయితే ఫోన్ వాడితే నష్టాలకంటే ఎక్కువ లాభాలే ఉన్నాయంటున్నాడు ఓ కోటీశ్వరుడు.

మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దీనికి సంబంధించిన ఉదాహరణ కూడా తెలిపాడు.

ఓ షాపు ముందర కూర్చున్న ఓ వ్యక్తి తన చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని వీడియో కాల్‌లో కొన్ని సైగలు చేస్తూ కనిపించాడు.

అటువైపు వెళ్లేవారికి అతడి సైగలు ఏమీ అర్ధం కాలేదు.కానీ ఆ ఫోన్‌లో ఉన్న అవతలి వ్యక్తికి మాత్రం స్పష్టంగా అర్ధమవుతున్నాయి.ఇంతకీ అతడు సైగలు ఎందుకు చేస్తున్నాడనేగా మీరు ఆలోచిస్తు్న్నారు.అతడు మూగవాడు.

అవతలి వ్యక్తికి తన సంభాషణ అర్థం అయ్యేలా చేతులతో సైగలు చేస్తూ వీడియో కాల్ చేసాడు.అక్కడున్న ఓ వ్యక్తి ఎవరో ఈ ఘటనను వీడియో తీయగా దీన్ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.ఫోన్ వల్ల నష్టాలే అంటూ ఆడిపోసుకోవడం మాని, ఫోన్ వల్ల కలిగే లాభాలు కూడా గుర్తించండి అంటూ ఆనంద్ మహీంద్రా తెలిపాడు.

నేటి డిజిటిల్ కాలంలో ఫోన్ వల్ల లాభాలు అనేకం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల మనసును కదిలిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube