అమెరికాలో కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేల కనిపించడం లేదు.పాజిటివ్ కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.
ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలకి చేరుకోగా.మృతుల సంఖ్య 45 వేలకి చేరుకుంది.
అయితే ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితులలో ఇళ్ళ నుంచీ ప్రజలు బయటకి రాకుండా లాడ్ డౌన్ పాటించాలని నిపుణులు హెచ్చరిస్తుంటే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ తీసేస్తున్నాం అంటూ ప్రకటిస్తున్నాయి.,.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేస్తున్న నేపధ్యంలో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయినా తమ రాష్ట్రాలలో జిమ్, హెయిర్ సెలూన్, లాంటి చిన్న చిన్న వ్యాపారాలని తెరవనున్నట్టుగా జార్జియా గవర్నర్ కెంప్ ప్రకటించారు.
అవసరమైన వైద్య చికిత్స పద్దతులు అన్ని సిద్డం చేసుకుని లాక్ డౌన్ ఎత్తేస్తున్నామని ప్రకటించారు.ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చిన్న చిన్న సౌకర్యాలు కూడా కలిపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
అయితే
న్యూజేర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ మాత్రం లాక్ డౌన్ తీసే సమస్య లేదని ప్రకటించారు.కరోనా సమయంలో ఇలాంటి సాహసం చేయడం కష్టమని ఇలాంటి పనులకి నేను విరుద్దమని అన్నారు.
తొందరపాటు గ వ్యవహరిస్తే కరోనా మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఇదిలాఉంటే లాక్ డౌన్ ఎత్తివేస్తామని కొన్ని రాష్ట్రాలు చెప్పడం వెనుక ట్రంప్ ఒత్తిడి ఉందని అంటున్నారు విశ్లేషకులు.