కరోనాపై యుద్దంకు స్టార్స్ తమవంతు సాయంను అందించేందుకు ముందుకు వస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా పలువురు టాలీవుడ్ స్టార్స్ లక్షలు.
కోట్లల్లో విరాళాలను ఇచ్చిన విషయం తెల్సిందే.టాలీవుడ్ నుండి పోటీ పడి మరీ స్టార్స్ కోట్లల్లో విరాళాలను ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో మన వాళ్లు నిజంగా హీరోలు అంటూ వారి వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో అల్లు అర్జున్ కూడా తన హీరోయిజంను నిరూపించుకున్నాడు.
అల్లు అర్జున్ కరోనాపై యుద్దంకు గాను తెలుగు రాష్ట్రాలకు ఇంకా కేరళ రాష్ట్ర ప్రభుత్వంకు 1.25 కోట్ల విరాళంను ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే బన్నీకి కేరళలో కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.
ఆ కారణంగానే బన్నీ కేరళ రాష్ట్ర ప్రభుత్వంకు కూడా విరాళంను ప్రకటించడం జరిగింది.బన్నీ ఈ సమయంలో కూడా కేరళ ఫ్యాన్స్‌ను గుర్తు పెట్టుకుని మరీ విరాళంను ఇవ్వడం పట్ల ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే పవన్, చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్‌లు విరాళం ప్రకటించారు.ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేరాడు.బన్నీ కోటికి పైగా విరాళం ఇచ్చి మంచి మనసును చాటుకున్నాడు.
పవన్ కళ్యాణ్ తర్వాత స్థానంలో బన్నీ నిలిచాడు.అల్లు అర్జున్ తన మంచి తనంను ఇలా నిరూపించుకున్నాడు అంటూ అంతా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.