టాలీవుడ్ లో చాల గొప్ప చిత్రాలు ఉన్నాయ్.ఇప్పుడు అయితే బాహుబలి అని , ఆర్ ఆర్ ఆర్ వంటి మహా గొప్ప సినిమాలు వచ్చి దేశాన్ని సాధిస్తున్న ఒకప్పుడు ప్రతి తెలుగు వాడు కలర్ ఎగరవేసుకొని చెప్పుకునే సినిమాలు అనేకం ఉన్నాయ్.
అందులో ఒకటి ఆకలి రాజ్యం.తెలుగు మరియు తమిళ్ లో ఒకేసారి షూటింగ్ జరుపుకొని ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది.
ఫిలిం ఫెర్ వంటి మూడు రివార్డ్స్ ని కూడా పొందింది.ఇక 1981 లో బాలచందర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా నిరుద్యోగం తో ఉన్న ఎంతో మంది యువకుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించింది.
ఇక ఈ చిత్రానికి కమల్ హాసన్ నటన పెద్ద అసెట్ అనే చెప్పాలి.
కమల్ మరియు శ్రీదేవి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.
ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.ఇప్పటికి చాల మంది పొట్ట కూటికోసం పాడుకుంటూ ఉంటారు.
ఈ సినిమాకు సంగీత అందించింది ఏం.విశ్వనాధ్ గారు.
మరో చరిత్ర సినిమా తర్వాత కమల్ హాసన్ కి బాల చందర్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, కోకిల వంటి సినిమాల్లో వరసగా కమల్ హాసన్ కి అవకాశం ఇచ్చారు.
ఇక ఆకలి రాజ్యం సినిమ హిట్ అయినా వెంటనే కమల్ హాసన్ మరియు శ్రీదేవి జంటగా కోకిల సినిమా తీస్తే అది కూడా చాల పెద్ద విజయాన్ని అందుకుంది.
ఆకలి రాజ్యం సినిమా చుసిన ప్రతిసారి తమతో ఆ సినిమాను కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు.ఇక ఈ సినిమాకి వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు తమ భవిష్యత్తు ఏంటి ? మనం ఎటు పోతున్నాం అని ఆలోచించకుండా ఉండరు.మనిషి వ్యక్తిత్వం, ఆకలి, మానవ సంబంధాలు, సమాజం వంటి అనేక విషయాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించిన తీరు ఎంతో ప్రత్యేకం.కేవలం సంభాషణల ద్వారా సినిమా హిట్ చేసుకున్నాడు.
ఇక సినిమాలో రమణ మూర్తి, ప్రతాప్ కె పోతన్ వంటి నటుల నటన కూడా చాల బాగుంటుంది.