గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది.నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేత కొడాలి నానికి చెక్ పెట్టాలని పార్టీ హైకమండ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
కొడాలి నానిని ఢీకొట్టేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.ఈ మేరకు కొడాలిపై పోటీ చేసేందుకు ఎన్ఆర్ఐని రంగంలోకి దించే యోచనలో ఉంది.
ఇందులో భాగంగా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును బరిలో దించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.రాము అభ్యర్థిత్వానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే రాము కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి గుడివాడలోనే వెనిగళ్ల రాము ఉంటాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.