ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు సూపర్‌ గుడ్‌ న్యూస్‌

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు.అది సాహో విషయంలో కనిపించింది.

 Agood News For Prabhasfans-TeluguStop.com

సాహోకు యావరేజ్‌ టాక్‌ వచ్చినా కూడా 400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి అంటే ప్రభాస్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సాహో చిత్రం నిరాశ పర్చినా కూడా ఆయన తదుపరి చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్‌ తదుపరి చిత్రం జాన్‌ అనే విషయం తెల్సిందే.

రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న జాన్‌ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయ్యింది.

త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుంది.ఇక ఈనెల 23న ప్రభాస్‌ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు.

ఈ సందర్బంగా జాన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకోసం ప్రత్యేకమైన ఫొటో షూట్‌ను చేస్తున్నారట.ఇటలీలో ఎక్కువ శాతం ఈ చిత్రీకరణ జరుపుతున్నారు.1980 కాలం కథతో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే.

Telugu Jhaanu, Prabhas, Prabhas Day, Sahoo, Sohoo-

  పూజా హెగ్డే హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటిస్తోంది.ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.దాదాపుగా 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంను తెలుగుతో పాటు సౌత్‌లో అన్ని భాషల్లో హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.సాహో ఫ్లాప్‌ కారణంగా జాన్‌ సినిమా బడ్జెట్‌ తగ్గిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కృష్ణం రాజు తన సొంత బ్యానర్‌లో ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్‌ వంశీ మరియు ప్రమోద్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube