టోటల్ గా లవ్ 7 స్టేజస్…ఇది చెప్పింది నేను కాదు!…”మధురం” షార్ట్ ఫిల్మ్…మంచి లవ్లీ ఫీలింగ్ లో కి తీస్కెళ్లే షార్ట్ ఫిల్మ్ అది.ఎస్పెషల్ గా “చాందిని ” ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఆక్టింగ్ కి ఫిదా అయిపోయారు అబ్బాయీలు…ప్రతి అమ్మాయి చిన్నదొ పెద్దదో ఒక లవ్ స్టోరీ కోరుకుంటది అని మూవీ చూసిన తరవాతె తెలిసింది.
డైలాగ్స్ అండ్ మ్యూసికల్ పవర్ ప్యాక్ అనే చెప్పొచ్చు “మధురం” షార్ట్ ఫిల్మ్ గురించి!.కాఫీ షాప్ లో అంత బ్యూటిఫుల్ లవ్ స్టార్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు!

ఈ షార్ట్ ఫిలిం లో “ఎక్కడ నుండి వచేస్తారయ్యా మీ అబ్బాయిలు…ప్రశాంతంగా ఉన్న మా మనసుల్ని కెలికేసి వెళ్ళిపోతారు”.అని చాందిని చౌదరి చెప్పే డైలాగ్ అందరికి గుర్తు ఉండే ఉంటది.ఎంతో మంది దుబ్స్మాషు లు కూడా చేసారు.
ఒక్క షార్ట్ ఫిలిం తో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ తెలుగు హీరోయిన్.తర్వాత రాహుల్ రవీంద్రన్ సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ అంత గుర్తింపు రాలేదు.
ఈమె హీరోయిన్‌గా నటించిన తాజా సినిమా ‘మను’ ఈ వారంలోనే విడుదల కాబోతోంది.ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే…పబ్లిక్ ఏ సినిమాకి నిర్మాతలు.ఈ నేపథ్యంలో ఆ సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేసింది ఈ హీరోయిన్.తెలుగమ్మాయి కావడం తనకు ప్లస్ పాయింట్ అని, సీన్లను స్పష్టంగా అర్థం చేసుకుని నటించడానికి అవకాశం ఏర్పడుతోందని చాందినీ అంటోంది.

అంతేకాదు కాస్టింగ్ కౌచ్ పై కూడా చాందిని మాట్లాడింది.టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు రాణించడం ఆగిపోయి చాలా కాలం అయ్యింది.1950ల నాటి నుంచి 70లు, 80ల వరకూ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వరకూ తెలుగమ్మాయిల ప్రభంజనం కొనసాగింది.అప్పట్లో తెలుగమ్మాయిలు పక్క భాషల్లో కూడా హీరోయిన్లుగా రాణించారు.స్టార్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు.90లలో ముంబై భామల దిగుమతి తర్వాత తెలుగింటి హీరోయిన్లు తగ్గిపోయారు.వీళ్లకు అవకాశాలు రావడం ఆగిపోయింది.మరోవైపు మలయాళీ ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్‌లో అవకాశాలను పొందడం ఆరంభం అయ్యింది.దీంతో.తెలుగమ్మాయిలు వెనుకబడ్డారు.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందేమో కానీ.తనకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చాందినీ చౌదరి స్పష్టం చేసింది.