తన కంచు కంఠంతో అద్భుతంగా డైలాగులు పలికిని నటుడు జగ్గయ్యగంభీరమైన వాయిస్ తో అవలోకగా డైలాగులు చెప్పగల నటుడు జగ్గయ్య.ఆయనకు భాషపై అమోఘమైన పట్టు ఉంది.
తనకు భాష మీద ఉన్న గ్రిప్ గురించి ఆత్రేయ అద్భుతంగా కొనియాడిన సందర్భాలున్నాయి.నిజానికి జగ్గయ్య తొలినాళ్లలో హీరోగా నటించాడు.కానీ ఆయన సక్సెస్ కాలేకపోయాడు.ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగాడు.అతన అద్భుత నటనతో ఆయన కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయ్యాడు.
మహా నటుడు జగ్గయ్యతో తనకు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి దర్శకుడు శివ నాగేశ్వర్ రావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సినిమా షూటింగ్ అయ్యాక జగయ్య ఇంటికి వెళ్తున్నాడట.అప్పుడు శివ నాగేశ్వర్ రావు తడబడుతూ ఆయన దగ్గరికి వెళ్లాడట.మీరు చెప్పిన డైలాగ్ లో ఐ కాంట్ కు బదులు ఐకేంట్ అని పలికారు అని చెప్పాడట.ఆ మాటకు జగయ్య నువ్వు ఏం చదువుకున్నావు? అని అడిగాడట.బీకాం అని చెప్పాడట శివ నాగేశ్వర్ రావు.

నేనేం చదవివానో తెలుసా? ఎంఏ హానర్స్ అని చెప్పాడట.దాన్ని కేంట్ అనే చదవాలి అని జగ్గయ్య తన కంచు కంటంతో చెప్పాడట.కానీ సినిమా చూసే వారిలో 90 శాతం మంది నాలాంటి వాళ్లే ఉంటారు అని చెప్పాడట.
కానీ నేను తప్పు చెప్తే జగ్గయ్య కూడా తప్పు చెప్పాడని తనను అంటారని వివరించాడట.కాబట్టి తాను చెప్పనట్లే ఉంచండి అన్నాడట.ఈ ఘటనతో జగ్గయ్యకు అంకితభావం నటనలోనే కాదు.జ్ఞానంలోనూ ఉందని తనకు అర్థం అయ్యిందని చెప్పాడు.