తెలంగాణ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం.. ఏపీ సీఎం సాయం

తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు తెలిపారు.

 Telangana, Power Station,accident, Ap Cm-TeluguStop.com

దీంతో సీఎం జగన్ జలవిద్యుత్ కేంద్రంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాడు.ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరినా వెంటనే అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అగ్ని ప్రమాదం సంభవించడంతో శుక్రవారం సీఎం జగన్ శ్రీశైలం పర్యటనను వాయిదా వేశారు.ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించడం కరెక్ట్ కాదన్నారు.వాస్తవానికి శ్రీశైలం రిజర్వాయర్ ను సందర్శించి పూజలు చేయాలి.పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం, వరద జలాలపై ఏపీ జెన్ కో అతిథి గృహంలో జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరగాల్సి ఉండేది.

కానీ అగ్ని ప్రమాదం సంభవించడంతో షెడ్యూల్ రద్దు చేసుకున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు కర్నూల్ జిల్లాలో కృష్ణా వరద జలాల పరిస్థితిపై సర్వే నిర్వహించి, దీంతో పాటుగా శ్రీశైలం ప్రాజెక్ట్, వెలిగొండ హెడ్ రెగ్యూలేటరీ పనులను, ఇతర ప్రాజెక్టులకు పరిశీలించాల్సి ఉండేది.అగ్నిప్రమాదం, వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube