సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో ముందుస్తు అరెస్టుల పర్వం కొనసాగింది.నేడు తెల్లవారుజామున సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు,కేతేపల్లి మండల కన్వీనర్ గండమల్ల ఆశీర్వాదం,సిఐటియు మండల కమిటీ సభ్యులు ఆదిమల్ల సుధీర్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందన్నారు.దొరల పాలనను అంతం చేసి స్వేచ్ఛ,ప్రజాస్వామిక హక్కులను కాపాడతామని, ప్రతిపక్ష నేతలను గొంతు నొక్కే ప్రయత్నం చేయడం హేయమైన చర్యని అన్నారు.