రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో నియామక పత్రాలు అందజేయనుండగా, జిల్లా నుంచి తరలివెళ్లారు.మూడు బస్సుల్లో 130 మంది తరలి వెళ్లే వాహనాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు.
స్కూల్ అసిస్టెంట్, ఎస్ జి టీ, భాషా పండితులు, పీఈటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు మొత్తం కలిసి దాదాపు 130 మంది అర్హత సాధించారని వెల్లడించారు.వీరందరికీ హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారని వెల్లడించారు.
మూడు వాహనాలకు ఆరోగ్య, పోలీస్ సిబ్బందిని కేటాయించారు.అలాగే ఒక్కో బస్సుకు ఎంఈఓలను లైజెన్ ఆఫీసర్ గా నియమించి, వారిని పంపించారు.
వీరి వెంట జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.