ప్రస్తుత రోజులలో ఎటు చూసినా కూడా అనేక ప్రాంతాలలో దొంగల బెడద తప్పడం లేదు.ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు అన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఏది దొరుకుతే అది దోచుకోవడానికి దుండగులు తెగబడి పోతున్నారు.
చివరికి దేవత విగ్రహాలు దొంగతనం చేయడం కూడా పాపమని తెలిసినా కానీ.దొంగతనం చేయకుండా ఉండలేదు ఒక వ్యక్తి.150 ఏళ్ల నాటి రాధాకృష్ణ విగ్రహంని( Radha Krishna Idol ) దొంగతనం చేసిన ఒక దొంగ చివరికి తప్పును తెలుసుకొని విగ్రహాన్ని తిరిగి ఇచ్చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో( Uttar Pradesh ) చోటు చేసుకుంది.
సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో( Prayagraj ) సెప్టెంబర్ 23న నవాబ్ గంజ్ లోని రామ్ జానకి ఆలయంలో వందేళ్ల నాటి అ రాధాకృష్ణ విగ్రహం చోరీకి గురి అయింది.ఒక దొంగ( Thief ) గుడి తలుపులు తాళం పగలగొట్టి మరి రాధాకృష్ణ విగ్రహాన్ని గుడిలో నుంచి ఎత్తుకొని వెళ్ళాడు.
ఇక విషయం తెలుసుకున్న ఆలయ పూజారి వెంటనే ఫిర్యాదు చేయగా నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.వారం రోజులు గడిచినా తర్వాత కూడా పోలీసులు ఆ విగ్రహాన్ని గుర్తించలేకపోయారు.
దీంతో ఆలయ పూజారి తీవ్ర మన స్థాపానికి గురయ్యి విగ్రహం కోసం నిరవధిక నిరాహార దీక్ష తీసుకున్నాడు.అయితే, ఈ సంఘటనలో భాగంగా ఎవరు ఊహించని విధంగా చోరీకి గురైన విగ్రహం జాడ తెలిసింది.
ఆలయం దొంగతనం జరిగిన అనంతరం వారం రోజుల తర్వాత జాతీయ రహదారిలో గౌఘాట్ లింక్ రోడ్డు వద్ద ఒక గుర్తు తెలియని గోనె సంచి మూటలో ఉండడం గమనించిన వారు వెంటనే అది ఓపెన్ చేసి చూడగా అందులో విగ్రహం ఉండడంతోపాటు దుండగుడు క్షమాపణ లేఖ( Apology Letter ) కూడా ఉంది.ఇక ఆ క్షమాపణ లేఖలో ఏముంది అన్న విషయానికి వస్తే… అయ్యా పూజారి నేను పెద్ద తప్పు చేశాను.నా అజ్ఞానం కారణంగా గౌఘాట్ నుంచి రాధా కృష్ణ విగ్రహాన్ని దొంగిలించాను.అప్పటి నుంచి నాకు చెడు కలలు వస్తున్నాయి.నా కుమారుడి ఆరోగ్యం కూడా క్షిణించింది.కొంత డబ్బు కోసం నేను నిజంగా తప్పు చేశాను.
క్షమించమని కోరుతూ విగ్రహాన్ని తిరిగి ఇస్తున్నా.నన్ను, నా పిల్లలను క్షమించమని వేడుకుంటున్నా.
విగ్రహాన్ని గుడిలో తిరిగి ఉంచాలని కోరుతున్నా అంటూ రాసుకో వచ్చాడు.మొత్తానికి విగ్రహం దొరకడంతో పూజారి ఆనందానికి హవదులు లేవు.