2043 కేజీల గంజాయిని నిర్వీర్యం చేసిన పోలీసులు

నల్లగొండ జిల్లా:జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ( Drug Destructon Committee ) ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి ( SP Chandana Deepti )పర్యవేక్షణలో శుక్రవారం నార్కట్ పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో పోలీసులు నిర్వీర్యం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్ల లో సీజ్ చేసిన సుమారు 5 కోట్ల10 లక్షల విలువ చేసే గంజాయిని కోర్టు అనుమతితో నిర్వీర్యం చేసామని తెలిపారు.

 Police Seized 2043 Kg Of Ganja, Drug Destructon Committee, Nalgonda District ,g-TeluguStop.com

డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోందని,గంజాయి అక్రమ రవాణాపై నల్లగొండ పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు.ఇప్పటికే సుమారు 1300 కేజీల గంజాయిని గతంలో తగలబెట్టామని,డ్రగ్స్ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని,ఎవరైనా గంజాయిని సేవించినా,రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్,డిఎస్పీ శివరాంరెడ్డి,డిస్ట్రిక్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube