'వాలంటీర్ ' లకు బాబు ఆఫర్లు .. కౌంటర్ ఇచ్చిన వైసిపి

వాలంటీర్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.మొన్నటి వరకు వాలంటీర్ల విషయంలో వ్యతిరేక వైఖరి ఉన్నట్లుగా కనిపించిన టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఇప్పుడు వాలంటీర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నారు.

 Ycp Countered Babu's Offers To 'volunteers', Janasena, Tdp, Chandrababu, Jagan,-TeluguStop.com

గత కొద్ది రోజులుగా ఆయన వాలంటీర్ల విషయంలో చేస్తున్న ప్రకటనలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.ముందులో వాలంటీర్ల ను హేళన చేసినట్లుగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్ల కు వరాల జల్లులు కురిపిస్తున్నారు.

టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని,  ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా నిలబడతామని చంద్రబాబు చెబుతున్నారు.ఇటీవల పెన్షన్ విషయంలో వాలంటీర్ల ద్వారా వాటిని పంపిణీ చేయడానికి వీళ్ళేదంటూ టిడిపి( TDP ) అనుకూల వ్యక్తిగా ముద్రపడిన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ( Commissioner Nimmagadda Prasad ) ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తో, వాలంటీర్ల ను పెన్షన్ల , రేషన్ సరుకుల పంపిణీకి దూరంగా ఉండాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది .అయితే దీని కారణంగా పెన్షన్లు తీసుకునేందుకు వృద్ధులు , వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan,

ఇదంతా చంద్రబాబు, టీడీపీ కారణంగానే జరిగిందని జనాల్లోకి వెళ్లడం, ఈ వ్యవహారం క్షేత్రస్థాయిలో బాగా టిడిపిని డామేజ్ చేయడంతో అలర్ట్ అయిన చంద్రబాబు వాలంటీర్ల సేవలను తాము అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తామని, వారి జీతాలు పదివేలకు పెంచుతామని హామీని ఇస్తున్నారు.  అయితే దీనిపై వైసీపీ( YCP ) గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.ఈ మేరకు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నని దీనిపై స్పందించారు.

చంద్రబాబు వాలటీర్ వ్యవస్థను నాశనం చేయాలని భావించారని , అది కుదరకపోవడంతో ఇప్పుడు కల్లబొల్లి ప్రేమ వలకబోస్తున్నారని నాని విమర్శించారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan,

చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని వాలంటీర్లకు సూచించారు.ప్రస్తుతం వాలంటీర్లకు ( volunteers )తాయిలాలు ప్రకటిస్తున్నారంటే ఈ వ్యవస్థ సక్సెస్ అయ్యింది అనడానికి నిదర్శనం అని పేర్ని నాని అన్నారు.వాలంటీర్లు రెండున్నర లక్షల మంది తన సైన్యంగా గతంలోనే జగన్ చెప్పారని నాని చెబుతున్నారు.

ప్రస్తుత వ్యవహారం చూస్తుంటే.వాలంటీర్లు ఇప్పుడు టిడిపి ,జనసేనకు కీలకమైనట్లు గా చంద్రబాబు స్టేట్ మెంట్లు చూస్తే అర్థమవుతుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube