దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని ఎన్నికల సంఘం మార్చింది.
ఈ మేరకు రెండు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ను జూన్ 2వ తేదీకి మార్చుతున్నట్లు వెల్లడించింది.కాగా జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని ఈసీ నిన్నటి షెడ్యూల్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.