ఒకప్పుడు కోట్లలో హీరోయిన్స్ పారితోషకం( Heroines Remuneration ) తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.
కోట్లలో తీసుకునేవారు కాస్త లక్షలు లోకి వచ్చారు.ఇంతలోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది.
మరి హీరోయిన్స్ అంతా ఎందుకు కట్టకట్టుకొని రెమ్యునరేషన్స్ ని తగ్గిస్తూ వస్తున్నారు.మామూలుగానే గొంతెమ్మ కోరికలు ఎక్కువగా కోరుతూ ఉంటారు హీరోయిన్స్.
అలాంటి పరిస్థితుల నుంచి సడన్ గా ఇంత మార్పు ఎలా సాధ్యమైంది అనేది అర్థం కాని పరిస్థితి.దీని వెనక భారీ మతులబు ఏమైనా ఉందా అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
![Telugu Samantha, Sreeleela, Tamannah, Tollywood-Movie Telugu Samantha, Sreeleela, Tamannah, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/Sai-Pallavi-Interesting-Comments-about-Remuneration.jpg)
సాయి పల్లవి( Sai Pallavi ) లాంటి ఒకరిద్దరూ హీరోయిన్స్ మాత్రమే తమ పారితోషికం విషయంలో క్లారిటీగా ఉంటారు.అందుకు గల కారణం ఓటిటి రైట్స్ సడన్ గా పడిపోవడమే.నాన్ థియరిటికల్ సినిమాలకు ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇస్తూ వచ్చారు మేకర్స్.కానీ ఎప్పుడైతే ఓటిటి డౌన్ అవుతూ వస్తుందో అప్పుడే హీరోయిన్స్ కి కూడా రెమ్యూనరేషన్ డౌన్ అవుతూ వచ్చాయి.
ఫ్రీ కంటెంట్ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు.అందుకే కోట్లు పెట్టి సినిమాలు తీస్తే థియేటర్ కి జనాలు ఎక్కడ వస్తున్నారు.
పైగా జనాలు రాకుండా కూడా వీళ్లకు కోట్లల్లో పారితోషకాలు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు.
![Telugu Samantha, Sreeleela, Tamannah, Tollywood-Movie Telugu Samantha, Sreeleela, Tamannah, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/Sreeleela-Krithi-Shetty-Remuneration.jpg)
అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశి కన్నా వంటి హీరోయిన్స్ కూడా ఓటీటి లో( OTTD ) కనిపించడం లేదు.కరోనా సమయంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఓటీటి లో సినిమా తీయడానికి ఇష్టపడ్డారు.అయితే ఇప్పుడు డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయింది.
దాంతో తమ పారితోషకాన్ని తగ్గించుకున్నారు హీరోయిన్స్.అంతేకాకుండా శ్రీ లీల( Sreeleela ), కృతి శెట్టి వంటి హీరోయిన్స్ ఒక సీజన్లో మెరిసి మాయమైపోయారు.
ఆ టైంలో అందరూ వారి వెనకే పడ్డారు.ఇక సమంతా( Samantha ) నుంచి తమన్న వరకు వారి పని అయిపోవడంతో వారికి అవకాశాలు లేవు.
వారికి మార్కెట్ అంతకన్నా లేదు.దాంతో రెమ్యూనరేషన్ డమాల్ అంటూ పడిపోయాయి.