ఇండస్ట్రీ లో చాలా మంది నటులు వాళ్ల ప్రతిభ ను చుపించుకోవాలని చూస్తు ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జగపతిబాబు( Jagapathi Babu ) ఒకప్పుడు మంచి నటుడుగా, అలాగే ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన కొన్ని ప్లాప్ ల వల్ల ఆయన హీరోగా ఫేడ్ ఔట్ అవ్వాల్సి వచ్చింది.ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో జగపతిబాబు చేసిన పెళ్లి పందిరి సినిమా( Pelli Pandiri Movie ) అప్పట్లో సూపర్ సక్సెస్ సాధించింది.
అయితే ఈ సినిమాని మొదట కోడి రామకృష్ణ శ్రీకాంత్ తో( Srikanth ) చేద్దామని అనుకున్నాడట, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.దాంతో జగపతి బాబు ను హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
ఇక ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ గా నిలుస్తాయి.కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) మేకింగ్ కూడా ఈ సినిమాకి మరొక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో జగపతిబాబు అద్భుతమైన నటనను కనబరచడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.ప్రస్తుతం జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నాడు… ప్రస్తుతం ఆయన ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో నటిస్తూ చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.ఇక ఇది ఇలా ఉంటే జగపతి బాబు లాంటి నటుడు ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా తెలుగు సినిమా అదృష్టం అనే చెప్పాలి…
.