తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య( Naga chaitanya ) హీరోగా చాలా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఆయన చేసిన సినిమాల్లో వైవిధ్యమైన లతంశలను ఎంచుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలనేవి పెద్దగా ఆడటం లేదు.
కానీ ఇప్పుడు తను చేస్తున్న తండేల్( Thandel ) అనే సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అందుకే ఈ సినిమాలో తను చాలా మంచి నటనని కనబరిచబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే నాగ చైతన్య ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతాడు అంటూ ఇప్పటికి ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మరి నాగ చైతన్య ఈ సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె క్యారెక్టర్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.నిజానికి క్యారెక్టర్ లో డెప్త్ ఉంటేనే సాయి పల్లవి క్యారెక్టర్ ను చేయడానికి సెలెక్ట్ చేస్తుంది.ఆమె ఒక క్యారెక్టర్ కి కమిట్ అయింది అంటే ఆ క్యారెక్టర్ లో మంచి విషయం ఉందని అర్థం చేసుకోవాలి.
ఇక ఇలాంటి క్రమంలోనే నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరి కలిసి ఇప్పటికే లవ్ స్టోరీ( Love Story ) అనే సినిమా చేశారు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే డైరెక్టర్ చందు మొండేటి( Chandoo Mondeti ) కూడా ఇంతకు ముందు కార్తికేయ 2 సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు కాబట్టి ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు…
.