ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ హీరో కృష్ణ( Super star krishna )లాంటి హీరో మరొకరు ఉండేవారు కాదు.ఎలాంటి ప్రయోగాత్మక చిత్రమైన సరే కృష్ణ( Krishna ) వెనకాడే వారు.
కాదు కథ నచ్చితే అది ఎంతటి క్లిష్టమైన ఎలాంటి జోనర్ అయినా కూడా ఆయన వెనకడుగు వేసిందే లేదు.
అందుకే అన్ని జోనర్స్ లో అన్ని రకాల వేరియేషన్స్ చూపిస్తూ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచారు కృష్ణ.కానీ కృష్ణను ఎవరు ఆదర్శంగా తీసుకోలేదు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.ఎందుకంటే ఒక్క ప్రయోగాత్మక చిత్రం చేయాలంటే ముందుకు వచ్చే నాధుడే లేడు.
దానికి మన హీరోలు రకరకాల సాకులు చూపుతారు.వారి సాకుల సంగతి పక్కన పెడితే ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఇప్పుడు రావడం లేదు.
మూస దూరంలో సినిమాలు తీస్తూ జనాలపై కోట్లకు కోట్లు నిర్మాతలకు నష్టాన్ని తీసుకొస్తున్నారు.పైగా ఏమైనా అంటే మా అభిమానులు అలాంటి కథలతో సినిమాలు తీస్తే ఒప్పుకోరు అంటూ నెపం ఫ్యాన్స్ పై వేసే ప్రయత్నం చేస్తున్నారు.మలయాళ సినిమా( Mollywood ) ఇండస్ట్రీని సైతం ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో కొత్త చిత్రాలను ప్రేక్షకులకు అందించిన వారు అవుతారు కానీ అందుకు కూడా మన టాలీవుడ్ హీరోలు సిద్ధంగా లేరు.గతంలో కొన్ని ప్రయోగాలు చేసిన అవి ఆ టైంలో జనాలు ఆదరించకపోవడంతో ఇలాంటి ధోరణిని హీరోలు సైతం అలవాటు చేసుకున్నారు.
అయితే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రమైన కూడా క్వాలిటీ తగ్గితే ప్రేక్షకులు ఒప్పుకోరు.కొంచెం ప్రయోగాత్మకంగా ఉండే సినిమాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.అప్పుడే అది ప్రేక్షకులకు నచ్చుతుంది.కానీ ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడూ ఒకేలా ఉండదు.కరోనా తర్వాత సినిమాలను చూసే పద్ధతి మారిపోయింది.ott పుణ్యమా అని భారీ బడ్జెట్ సినిమాల కన్నా కూడా చిన్న చిత్రమైన సరే బాగుంటే చూస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా సినిమాను విజయవంతం చేస్తున్నారు అందుకే నిర్మాతలు, దర్శకులు, హీరోలు విషయంలో మరోసారి ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కృష్ణ లాగా మరొక ప్రయోగాత్మక హీరో తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం.