ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి ( Venu Swamy ) ఈ మధ్యకాలంలో భారీ స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు.ఇటీవల కాలంలో ఈయన చెప్పే జాతకాలు నిజం కాకపోవడంతో పలువురు ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు.
అయితే సెలబ్రిటీ జాతకాలను రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నటువంటి వేణు స్వామి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇక ఈయన సెలబ్రిటీల జాతకాలు చెప్పడమే కాకుండా వారి జాతకంలో ఏదైనా దోషం ఉంటే దోష పరిహార పూజలు కూడా చేస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలకు హీరోయిన్లకు కూడా ఈయన ప్రత్యేకంగా పూజలు చేసిన విషయం మనకు తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతూ ఉన్నాయి.ఇకపోతే వేణు స్వామి ఇలా సెలబ్రిటీల జాతకాలను మాత్రమే కాకుండా సాధారణ ప్రజల జాతకాలను కూడా చెబుతాను అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు.అయితే ఈయన చేత జాతకం చెప్పించుకోవాలంటే ఎంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అనే విషయం గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.
వేణు స్వామి చేత జ్యోతిష్యం( Astrology ) చెప్పించుకోవాలన్న లేదంటే ఆయన చేత జాతక దోష పరిహార పూజలు చేయించుకోవాలన్న గంటకు 5000 రూపాయలు చొప్పున డబ్బు తీసుకుంటారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.ఇలా గంటకు 5000 అంటే మామూలు విషయం కాదని చెప్పాలి అయితే ఇదంతా కూడా వేణు స్వామికి కేవలం సైడ్ బిజినెస్ మాత్రమే నట.ఈయన జాతకం ప్రకారం ఈయన మెయిన్ బిజినెస్ అయితే పబ్ రన్ చేయడమే అంటూ ఇటీవల పలు సందర్భాలలో వేణు స్వామి తెలియజేశారు.