యనమల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.యనమల రాజేశ్ ఉంటే తాను టీడీపీలో ఉండనని యనమల కృష్ణుడు తేల్చి చెప్పారని తెలుస్తోంది.
గత ముప్ఫై ఏళ్లుగా తుని నియోజకవర్గంలో టీడీపీ జెండా తాను మోస్తుంటే ఇప్పుడు వచ్చి పెత్తనం చేయడం ఏంటని కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు.పార్టీలో సముచిత స్థానం లేకపోతే పార్టీ నుంచి తప్పుకుంటానని యనమల కృష్ణుడు స్పష్టం చేశారు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా తునిలో యనమల కృష్ణుడు, రామకృష్ణుడు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పలుమార్లు ఇరువురు నేతల మధ్య వివాదాలు చెలరేగిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా యనమల కుటుంబంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది.