వైసీపీ పార్టీ( YCP ) గత కొన్ని రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో జరుగుతూ ఉంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారు.డిసెంబర్ 29వ తారీకు శుక్రవారం అనంతపురంలో( Anantapuram ) ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.
అనంతపురం చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పేర్ని నాని( Perni Nani ) మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించకుండా మొండి చేయి చూపించారని విమర్శించారు.అదే సమయంలో లోకేష్ కి( Nara Lokesh ) మాత్రం మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.సీఎం జగన్( CM Jagan ) మంత్రివర్గంలో 17 మంది బలహీనవర్గాలకు స్థానం కల్పించారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.ఎవరైనా అడ్డంకులు సృష్టించిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్సార్ దే అని వ్యాఖ్యానించారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడు సంక్షేమం గురించి పట్టించుకోలేదు.రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు.
మీకు మంచి జరిగి ఉంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి అని.పేర్ని నాని స్పీచ్ ఇచ్చారు.