దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘వ్యూహాం ’ సినిమాపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.
వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాను విడుదల కాకుండా ఆపాలని నిర్మాతను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
విచారణలో భాగంగా టీడీపీ తరపున మురళీధర్ రావు కోర్టులో వాదనలు వినిపించారు.పొలిటికల్ ఎజెండాతో ఆర్జీవీ వ్యూహం సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో సీఎం జగన్ కు అనుకూలంగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా కథ ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఏపీలో వచ్చే ఎన్నికల్లో సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందన్న నేపథ్యలో సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.
అయితే స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు 28న మరోసారి విచారించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.