తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర నటుడు అమర్ దీప్( Amar Deep ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్దీప్ జానకి కలగనలేదు సీరియల్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.
ఇకపోతే అమర్ దీప్ తాజాగా ముగిసిన బిగ్ బాస్ హౌస్ లోకి ( Bigg Boss house )ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడు అనుకున్న అమర్ దీప్ రన్నరప్ గా నిలవడంతో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు.
ఇకపోతే బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కార్ల అద్దాలు అని ధ్వంసం చేస్తూ నానా రచ్చ చేశారు.ముఖ్యంగా అమర్ దీప్ ఫ్యామిలీని భయపెట్టేశారు.అయినా కూడా అమర్దీప్ భయపడకుండా తన తల్లి పెళ్ళాం జోలికి వెళ్ళవద్దని కోపం ఉంటే తనను ఏమైనా చేసుకోమంటూ మీడియా ముందు చేతులు జోడించి మరి అడిగాడు.
ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ షో ముగియడంతో ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు.ఇక రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ తాజాగా తన కుటుంబంతో కలిసి సొంత జిల్లా అనంతపురంకి( Anantapur ) వెళ్లారు.
అనంతపురం వెళ్లిన అమర్‌దీప్ తన ఫ్యామిలీతో కలిసి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఒక ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు, మహిళలకు దుప్పట్లు అందజేశారు.

అక్కడే చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో అమర్‌దీప్‌తో పాటు ఆయన భార్య తేజు, మదర్ కూడా పాల్గొన్నారు.అనంతరం అక్కడికి వచ్చన వారికి భోజనాలు వడ్డించారు.ఈ సందర్భంగా.దేవుడికి నాకు ఇచ్చిన శక్తిమేరకు తప్పకుండా సాయం చేస్తూనే ఉంటానని అమర్‌దీప్ తెలిపారు.అమర్ దీప్ చేసిన పనికి అతనిపై అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
మీది చాలా గొప్ప మనసు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.