యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ మాత్రమే కాదు.యావత్ సినీ లవర్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సలార్ ( Salaar ) కూడా ముందు వరుసలోనే ఉంది అని చెప్పాలి.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
ఈ ట్రైలర్ తో అప్పటి వరకు ఉన్న అంచనాలను పీక్స్ కు చేర్చగా ఈ సినిమా కోసం మరింతగా ఎదురు చూసేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అవుతున్నారు.మరి రిలీజ్ కు డేట్ దగ్గర పడడంతో చిన్న చిన్న ఫినిషింగ్ పనులను పూర్తి చేసే పనిలో టీమ్ అంత ఉన్నట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా ప్రభాస్ మొన్నటి వరకు విదేశాల్లో ఉండడంతో ఈయన డబ్బింగ్ కాస్త మిగిలి పోయిందట.మరి ఆ పనులను ప్రభాస్ ఫైనల్ వర్క్ లో పూర్తి చేస్తున్నారని ప్రభాస్ ప్రస్తుతం తన డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.హైదరాబాద్ లోనే డబ్బింగ్ పనులన్నీ పూర్తి చేస్తున్నట్టు టాక్.ఈ చిన్న చిన్న వర్క్స్ ఫినిష్ అయితే ఇక ప్రభాస్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో.