నల్గొండ జిల్లాలో భార్యను హతమార్చిన భర్త.. అసలు కారణం ఏమిటంటే..?

కుటుంబంలో కలహాలు ఉంటే సర్దుకుపోవడం, కూర్చొని పరిష్కరించుకోవడం లాంటివి చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబం సంతోషంగా ఉంటుంది.అలాకాకుండా ప్రతి చిన్న విషయానికి గొడవ పడితే క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, చేసే దారుణాలు కుటుంబాలని రోడ్డున పడేస్తాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 The Husband Who Killed His Wife In Nalgonda District.. What Is The Real Reason-TeluguStop.com

ఓ కుటుంబంలో భార్యాభర్తల( Husband wife ) మధ్య తరచూ గొడవలే.దీంతో మద్యం మత్తులో ఉన్న భర్త కత్తితో భార్యను హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా( Nalgonda district )లో చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Agamotkur, Madugula Palli, Nalgonda-Latest News - Telugu

మాడుగుల పల్లి ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం ఆగమోత్కూరు గ్రామానికి చెందిన నాగయ్య, రమణ(35)లకు 22 సంవత్సరాల క్రితం వివాహం అయింది.ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం.

ఈ దంపతులు నల్గొండ మండలం జి అన్నారంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు.గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య ప్రతి విషయానికి గొడవ జరుగుతూ ఉండడంతో విసిగిపోయిన భార్య రమణ కుమార్తెతో కలిసి తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం లో ఉండే తన పుట్టింటికి వెళ్ళిపోయింది.


Telugu Agamotkur, Madugula Palli, Nalgonda-Latest News - Telugu

ఆ తరువాత ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వారం రోజుల కిందట ఆగమోత్కూరు కు వచ్చారు.అయితే గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాగయ్యకు, అతని భార్య రమణకు మధ్య మళ్లీ గొడవ జరిగింది.నాగయ్య క్షణికావేశంలో ఇంట్లో ఉండే కత్తితో రమణ గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న రమణ ని చూసిన ఆమె కూతురు చుట్టుపక్కల వాళ్లకు చెప్పగా.

అందరూ వచ్చి ఆసుపత్రికి తరలించే లోపే రమణ మృతి చెందింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని పరారీలో ఉండే నిందితుడిని గాలిస్తున్నట్లు మాడుగులపల్లి ఎస్సై నరేష్ కుమార్( Naresh Kumar ) తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube