తొలి టీ20 లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..విజయంపై స్పందించిన సూర్య..!

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.

 Team India Thrilling Victory On Australia In T20 Series First Match Details, Tea-TeluguStop.com

ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ 110 పరుగులతో రాణించగా.స్టీవ్ స్మిత్( Steve Smith ) 52 పరుగులతో రాణించాడు.

భారత బౌలర్లైన ప్రసిద్ధి కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.అనంతరం 209 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టులో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 80 పరుగులతో అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ తో రాణించాడు.

Telugu Australia, India Australia, Ishan Kishan, Rinku Singh, Steve Smith, India

కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) అవుట్ అయిన తర్వాత భారత జట్టు మూడు బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయి ఓటమి అంచుకు చేరింది.కానీ రింకూ సింగ్( Rinku Singh ) తన స్టైల్ లో మ్యాచ్ ఫినిష్ చేశాడు.చివరి బంతికి ఒక పరుగు అవసరం ఉండగా రింకూ సింగ్ సిక్స్ కొట్టాడు.

అయితే రింకూ సిక్స్ కోట్టకపోయినా గెలుపు భరత్ దే.ఎందుకంటే.అబాట్ వేసిన చివరి బంతి నో బాల్. మ్యాచ్ అనంతరం సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.తమ జట్టు ఆటగాళ్ల ఆటతీరు చాలా అద్భుతంగా ఉందని అందరినీ కొనియాడాడు.మ్యాచ్ మధ్యలో తమ జట్టు కాస్త ఒత్తిడికి గురైందని, దానిని అధిగమించి తమ జట్టు ఆటగాళ్లు సత్తా చాటడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.

Telugu Australia, India Australia, Ishan Kishan, Rinku Singh, Steve Smith, India

ఆస్ట్రేలియా జట్టు 230 ప్లస్ పరుగులు చేస్తుందని తాము భావించామని, కానీ ఆఖరిలో తమ జట్టు బౌలర్లు, ఆస్ట్రేలియా బ్యాటర్ లను అద్భుతంగా కట్టడి చేశారని తెలిపాడు.ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ ఎంజాయ్ చేయాలని ఇషాన్ కు( Ishan Kishan ) చెప్పానని, ఇషాన్ చాలా ఫ్రీగా షాట్లు ఆడి అర్థ సెంచరీ చేశాడని చెప్పుకొచ్చాడు.తాను కెప్టెన్సీ లగేజీని డ్రెస్సింగ్ రూమ్ లో వదిలేసి బరిలోకి దిగడం వల్ల చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేయగలిగాను.రింకూ సింగ్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, చివర్లో రింకూ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని, మైదానంలో ప్రేక్షకులు తమ జట్టుకు బాగా సపోర్ట్ చేశారని సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube