చర్మంపై దురద, దద్దుర్లను పోగొట్టే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు మీకోసం!

దురద, దద్దుర్లు.కొందరిని అత్యంత సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యలు ఇవి.రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఎండల ప్రభావం, ఆహారపు అలవాట్లు, బిగుతైన దుస్తులు ధరించడం తదితర కారణాల వల్ల చర్మంపై దురద.ఆ తర్వాత దద్దుర్లు వంటివి ఏర్పడుతుంటాయి.

 Home Remedies For Rashes And Itching,rashes, Itching, Home Remedies, Health, Hea-TeluguStop.com

ఇవి చాలా చిన్న సమస్యలే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తాయి.పైగా ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.

అందుకే ఈ సమస్యలను వదిలించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్‌ ఇంటి చిట్కాలను త‌ప్ప‌కుండా పాటించాలి.మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Rashes, Skin Problems-Telugu Health

కొత్తిమీర.దుర‌ద‌ దద్దుర్లు వంటి సమస్యలను నివారించడానికి ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.అందుకోసం ఒక క‌ప్పు ప‌చ్చి కొత్తిమీరను నీటిలో శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

కొత్తిమీర జ్యూస్‌లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ మిక్స్ చేసి దురద లేదా దద్దుర్లు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకోవాలి.అరగంట అనంతరం వాటర్ తో శుభ్రంగా కడగాలి.

ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Telugu Tips, Rashes, Skin Problems-Telugu Health

దురద, దద్దుర్లు వంటి దూరం అవ్వాలన్నా.మళ్ళీ మళ్ళీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా వేప చెట్టు బెరడు కషాయాన్ని డైట్ లో చేర్చుకోవాలి.చర్మ సంబంధిత సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కషాయం గ్రేట్ గా సహాయపడుతుంది.

ఇక కొబ్బరి నూనెతోనూ దురద దద్దుర్లు వంటి సమస్యలను నివారించుకోవచ్చు.ప్రభావిత ప్రాంతంలో గోరువెచ్చ‌ని కొబ్బరినూనె అప్లై చేసుకుని సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.

త‌ద్వారా కొబ్బ‌రి నూనెలో ఉండే యాంటీ ఫంగల్‌ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దురద దద్దుర్లను చాలా సులభంగా తగ్గిస్తాయి.లేదా కొబ్బ‌రి నూనెలో స్వ‌చ్ఛ‌మైన గంధం పొడి క‌లిపి చ‌ర్మంపై అప్లై చేసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube