చైసామ్ విడిపోయాక చైతన్యకు( Nagachaitanya ) కెరీర్ పరంగా విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి.థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.
తాజాగా నాగచైతన్య పనిలేక జుట్టు, గడ్డం పెంచాను అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నాగచైతన్య తాజాగా కొత్త లుక్ లో దర్శనం ఇవ్వగా ఆ లుక్ ఆకట్టుకుంటోంది.
కొత్త సినిమా కోసం చైతన్య మేకోవర్ అవుతుండగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు నాగచైతన్య స్పందిస్తూ ఖాళీగా ఉండటం వల్ల పనీ పాట లేక జుట్టు, గడ్డం పెంచానని కామెంట్లు చేశారు.చందు మొండేటి( Chandoo Mondeti ) సినిమాకు సంబంధించి గెటప్ ఇప్పటికే లాక్ అయిందని ఫస్ట్ లుక్ ఫోటో షూట్ కూడా పూర్తైందని చైతన్య కామెంట్లు చేశారు.
త్వరలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని చైతన్య చెప్పగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
![Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Nagachaitanya, Sai Pallavi-Movie Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Nagachaitanya, Sai Pallavi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/young-hero-nagachaitanya-shocking-comments-goes-viral-in-social-media-detailss.jpg)
డిసెంబర్ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనుందని సమాచారం అందుతోంది.ఈ సినిమా కోసం నాగచైతన్య భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.నాగచైతన్య సాయిపల్లవి( Sai Pallavi ) కాంబినేషన్ రిపీట్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
సినిమా సినిమాకు లుక్ విషయంలో మార్పు ఉండేలా చైతన్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Nagachaitanya, Sai Pallavi-Movie Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Nagachaitanya, Sai Pallavi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/young-hero-nagachaitanya-shocking-comments-goes-viral-in-social-media-detailsd.jpg)
నాగచైతన్య మంచి కథలను ఎంచుకుంటున్నా ఆయనకు లక్ మాత్రం కలిసిరావడం లేదనే చెప్పాలి.చైతన్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చైతన్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్న కథలను ఎంచుకుంటే నాగచైతన్య సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు భారీ సక్సెస్ లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.