తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ( Krishna ) ఒక ప్రభంజనం.ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాగా కొనసాగుతున్న రోజుల్లో మరో హీరో వాళ్ళ స్టామినా ముందు నిలబడేవారు కాదు.
అలాంటి డామినేషన్ ఉన్న రోజుల్లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కృష్ణ, కెరీర్ ప్రారంభం నుండే వైవిద్యభరితమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు.పౌరాణికం కి ఎన్టీఆర్, సాంఘికం కి ఏఎన్నార్ ప్రసిద్ధి గాంచిన రోజుల్లో, కృష్ణ మొట్టమొదటి జేమ్స్ బాండ్ గా, మొట్టమొదటి కౌ బాయ్ గా ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేసి గ్రాండ్ సక్సెస్ అవ్వడం కాకుండా టాలీవుడ్ స్థాయిని పెంచిన మహానుభావుడిగా చరిత్ర సృష్టించాడు.
అంతే కాదు టెక్నాలజీ పరంగా కూడా కృష్ణ తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు టాలీవుడ్ ని మరో మెట్టు ఎక్కించింది.
![Telugu Allurisitarama, Fights, Krishna, Tollywood-Movie Telugu Allurisitarama, Fights, Krishna, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Krishna-tollywood-fights-Alluri-Sitarama-Raju-viral-social-media-Adurthi-Subba-Rao-Mayadari-Malligadu.jpg)
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తొలి సౌత్ స్కోప్, తొలి 70 ఏంఏం సినిమాలను పరిచయం చేసిన ఘనత కృష్ణ కి మాత్రమే సొంతం.అంతే కాదు ఒకే ఏడాదిలో ఆయన 20 కి పైగా చిత్రాలను విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అంటే 24 గంటలు పని చేస్తూనే ఉండేవాడు అన్నమాట.
అప్పట్లో ఆయన ఎంత బిజీ అంటే, ఆయన నిద్రపోతున్న ఘట్టాలను కూడా సన్నివేశాలుగా చిత్రీకరించేవారట.ఆ రేంజ్ డిమాండ్ ఉన్న హీరో.
ఇదంతా పక్కన పెడితే కృష్ణ గారి సాహసం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.ఆయన సినిమాల్లో సాధ్యమైనంత వరకు డూప్స్ ని పెట్టుకోడానికి ఇష్టపడేవాడు కాదట.
ఒక సినిమాలో కృష్ణ నిజమైన పులితో ఫైట్ చెయ్యాలి.ఒక బావిలో పులి కి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఈ సన్నివేశం ని చేశారట.
![Telugu Allurisitarama, Fights, Krishna, Tollywood-Movie Telugu Allurisitarama, Fights, Krishna, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Krishna-tollywood-Adurthi-Subba-Rao-Mayadari-Malligadu.jpg)
కృష్ణ మీద పులితో కొన్ని షాట్స్ తీసిన తర్వాత, ఆయన డూప్ లోపలకు దిగాడు.అప్పటి వరకు మత్తుగా పడున్న పులి కి మత్తు వీడి కృష్ణ డూప్ పై విరుచుకుపడింది అట.పాపం అతనికి బాగా గాయాలు అయ్యాయి.క్షణ కాలం ముందే కృష్ణ బయటకి వచ్చాడు.
ఆలస్యం అయ్యి ఉంటే పులి కృష్ణ మీద దాడి చేసి ఉండేది.ఇక మరో భయంకరమైన ప్రమాదం ఏమిటంటే, కృష్ణ గారు అప్పట్లో ‘మాయదారి మల్లిగాడు( Mayadari Malligadu )’ అనే చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమా లో కృష్ణ ఉరికంబం ఎక్కే సన్నివేశం ఒకటి ఉంటుంది.ఉరికంబం సన్నివేశం అవ్వగానే కృష్ణ గారు బయటకి వచ్చారు.
అప్పటి వరకు ఆయన కాళ్ళ క్రింద వేసి ఉన్న చెక్కలు ఒకసారిగా కుప్పకూలిపోయాయి.ఆ స్థానం లో కృష్ణ అలాగే నిల్చొని ఉంటే ఆయన ఉరి నిజంగానే పడిపోయేది.
ఈ సంఘటన జరిగిన అనంతరం దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు( Adurthi Subba Rao ) కృష్ణ ని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడట.