నవంబర్ 11వ తేదీన వచ్చిన ధన త్రయోదశి శని త్రయోదశి రోజు.. ఈ ముఖ్యమైన పనులను చేయండి..!

నవగ్రహాలలో ఏడవ గ్రహమైన శనీశ్వరుడు సూర్య భగవానుడి కుమారుడు అని దాదాపు చాలా మందికి తెలుసు.మనిషి చేసే పాప, పుణ్యాల ఆధారంగా వారి ప్రవర్తనను శనీశ్వరుడు నియంత్రిస్తాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

 Dhana Trayodashi On 11th November Is Shani Trayodashi Day Do These Important Thi-TeluguStop.com

బతికి ఉండగా చేసే పాప పుణ్యాలను శని పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తిగా వ్యవహరిస్తే, మరణం తర్వాత ఆ పాపపుణ్యాల ఆధారంగా శిక్షలు సూర్యుని కుమారుడైన ధర్మరాజు శిక్షలు వేస్తాడు.సూర్యుని కుమారులైన శనీశ్వరుడు, యమధర్మరాజు ఇద్దరు న్యాయాధికారులే.

వాస్తవానికి శని పేరు వినగానే అందరూ భయపడతారు.కానీ శనిని భయంతో కాకుండా భక్తితో కొలుస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Telugu Anjaneya Swami, Devotional, Dhana Triodasi, Goddess Lakshmi, Lord Shanisw

నవంబర్ 11వ తేదీన శనివారం రోజు ధన త్రయోదశి( Dhana Triodasi ) తో పాటు శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది.ఈ రోజు మీరు పాటించే నియమాలు శని ప్రభావం తగ్గించి లక్ష్మీదేవి ( Goddess Lakshmi )అనుగ్రహం లభించేలా చేస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి నువ్వుల నూనెతో శనీశ్వరుడికి దీపం వెలిగించాలి.ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి.

శని త్రయోదశి రోజు ( Shani trayodashi )మద్యం, మాంసాహారం, ఉల్లి,వెల్లుల్లికి దూరంగా ఉండడం మంచిది.శివార్చన ఆంజనేయ స్వామి( Anjaneya Swami ) ఆరాధన ద్వారా శని ప్రభావం దూరమవుతుంది.

ఆకలితో అలమటించే వారికి, మూగజీవులకు భోజనం పెట్టాలి.

Telugu Anjaneya Swami, Devotional, Dhana Triodasi, Goddess Lakshmi, Lord Shanisw

ఎవరి దగ్గర నుంచి ఇనుము,ఉప్పు, నువ్వుల నూనె తీసుకోకూడదు.అలాగే నవగ్రహాల దేవాలయంలో ప్రసాదం పంచి పెట్టాలి.కాలువలో కానీ పరే నదిలో కానీ బొగ్గులు, నల్ల నువ్వులు వేసి శనికి నమస్కరించాలి.

బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శని ప్రభావం దూరం అవుతుంది.శని త్రయోదశి రోజు మాత్రమే కాకుండా ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షణ చేయాలి.

అయ్యప్ప మాల ధరించడం,శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy )కి తలనీలాలు ఇవ్వడం, కాలభైరవ దర్శనం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుందని పండితులు ( Scholars )చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube