నటి రష్మిక మందన్నా( Rashmika mandanna ) ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగులో, బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.త్వరలో రణబీర్ సరసన యానిమల్( Animal ) సినిమాతో రాబోతుంది.
వచ్చే సంవత్సరం పుష్ప 2( Pushpa 2 )తో రాబోతుంది.ఇలా వరుస భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తరచూ హైదరాబాద్ ముంబై ప్రయాణం చేయాల్సి వస్తుంది .అయితే తాజాగా ఎయిర్ పోర్టులో రష్మికకు ఊహించని షాక్ ఎదురైంది ఆమె ఎయిర్ పోర్టులో వెళుతుండగా ఒక అభిమాని వచ్చి ఏకంగా తనకు ముద్దు పెట్టడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
రష్మిక ఎయిర్ పోర్టు( Airport )లో వెళుతుండగా ఒక చిన్నారి అభిమాని వచ్చి ఆమె చేతిని పట్టుకొని రష్మిక బుగ్గలను గిల్లడమే కాకుండా అనంతరం రష్మిక బుగ్గపై ముద్దు కూడా పెట్టింది ఇలా చిన్నారి అభిమాని తనకు ముద్దు పెట్టడంతో రష్మిక కూడా కళ్ళు మూసుకొని ఆ ఫీల్ ఎంజాయ్ చేశారు.అనంతరం వారికి ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా వారితో కలిసి ఫోటోలు దిగారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సాధారణంగా సినిమా సెలబ్రిటీలను ఎవరైనా అభిమానులు( Fans ) కలవాలి అంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.వారి సెక్యూరిటీ దగ్గరికి కూడా రానివ్వరు అలాంటిది రష్మిక ఎంతో మంది అభిమానులను దగ్గరికి తీసుకొని ఫోటోలు దిగడమే కాకుండా వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు.తాజాగా చిన్నారి సైతం ఏకంగా తనకు ముద్దు పెట్టడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రష్మిక తీరు పట్ల నేటిజన్స్ అలాగే అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రష్మిక అభిమానులు పట్ల చూపించే ప్రేమ మరో లెవల్ అని ఈ విషయంలో ఈమెకు మరి ఎవరు సాటిరారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.