ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత రసవత్తరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఆసక్తికరమైన టాస్కులతో, ఊహించని ట్విస్టులతో ప్రతీ వారం ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తూ ఈ షో ముందు సీజన్స్ కంటే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.
ఇప్పటి వరకు అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సంపాదించుకున్న ఏకైక సీజన్ ఇదే.ప్రతీ రోజు కనీసం 10 పాయింట్స్ కి తక్కువ కాకుండా వస్తున్నాయట.ఇక పోతే ఈ సీజన్ లో ప్రతీ కంటెస్టెంట్ తమ ఆటని ఎంతో అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోతున్నారు.కానీ రతికా( Rathika ) మాత్రం ఇప్పటి వరకు ఆమె ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనేది చూపించలేదు.
హౌస్ లో కన్నింగ్ బాండింగ్స్ నడుస్తూ పల్లవి ప్రశాంత్ , యావర్ గేమ్స్ ని చెడగొట్టడానికి చూసిన రతికా ని జనాలు బయటకి పంపేశారు.ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ని అతి నీచంగా మాట్లాడిన ఆమె తీరుని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది.
ఆమె ప్రవర్తన నచ్చకనే హౌస్ నుండి బయటకి పంపేశారు జనాలు.కానీ ఏ కంటెస్టెంట్ కి రాని అదృష్టం ఆమెకి వచ్చింది.బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.రీ ఎంట్రీ తర్వాత అయినా తన తప్పులని తెలుసుకొని బాగా ఆడుతుంది అనుకుంటే, ఇప్పుడు కూడా ఇంతకు ముందు ఎలా అయితే అదేదో అదే స్ట్రాటజీ తో ఆడుతుంది.
రెండు వారాలు బయటకి వెళ్లిన తర్వాత ఆమె సోషల్ మీడియా లో ఎవరికీ ఎక్కువ ఫాలోయింగ్ ఉంది?, ఏ గ్రూప్ లోకి వెళ్తే సేఫ్ అవుతాము అనేది బాగా గమనించి శివాజీ( Shivaji ) బ్యాచ్ లోకి వెళ్ళింది.ఇక నుండి నేను మీ టీం లోనే ఉంటాను, వాళ్ళ పక్కన అసలు కూర్చోను, ఒక్కొక్కరిని నామినేషన్స్ లోకి లాగి బయటకి పంపేద్దాం అంటూ మొన్న ప్రిన్స్ యావర్ తో చెప్తుంది రతికా.
అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తో మళ్ళీ మాట్లాడేందుకు, జతకట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ముందుగా భోలే శవాలీ తో కలిసి పల్లవి ప్రశాంత్ వద్దకి వెళ్లి, మొట్టమొదటి కెప్టెన్ అయ్యినందుకు ధన్యవాదాలు అని అంటుంది రతికా.ఆ తర్వాత భోలే శవాలీ వీళ్ళిద్దరిని కలిపే విధంగా ప్రేమ పాటలు పాడుతాడు.దానికి రతికా వైపు నుండి చాలా పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి.అంటే మళ్ళీ ఆమె లవ్ ట్రాక్ నడిపేందుకు సిద్ధం అవుతుంది అన్నమాట.ప్రశాంత్ తో అక్క అని పిలిపించుకొని ఇప్పుడు మళ్ళీ లవ్ ట్రాక్ లోకి లాగాలని చూడడం చూస్తుంటే ఈమెని మళ్ళీ జనాలు బయటకి పంపిస్తారని అంటున్నారు నెటిజెన్స్.