రేణు దేశాయ్ ని అడ్డు పెట్టుకొని వైసీపీ పార్టీ త్వరలోనే రాజకీయం చెయ్యబోతుందా..?

ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో ప్రతీ ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు మరియు కేసులు ఉన్నాయి.స్వయానా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే 43 అవినీతి ఆరోపణల తో కూడిన సిబిఐ కేసులు ఉన్నాయి.

 Is The Ycp Party Going To Do Politics By Targeting Renu Desai Details, Ycp, Renu-TeluguStop.com

అలాగే చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) మీద అనేక అవినీతి ఆరోపణలు ఉండడం వల్ల ప్రస్తుతం జైలు లో ఉన్నాడు.ఇలా రాజకీయాల్లో ఉన్న ప్రతీ ఒక్కరి పై ఎదో ఒక అవినీతి ఆరోపణ ఉంది.

ఒక్క పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మీద తప్ప.తన కష్టం తో సంపాదించిన డబ్బులతో జనసేన పార్టీ ని( Janasena ) నడుపుతున్నాడు.

కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎదో ఒక ఆరోపణ చెయ్యాలి.పవన్ కళ్యాణ్ మీద అవినీతి ఆరోపణలు చెయ్యలేరు, ఇక మిగిలింది ఆయన పెళ్లిళ్ల ప్రస్తావనే.

అందుకే ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి నుండి మంత్రులు, ఎమ్యెల్యే లు ఇలా ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు.

Telugu Akira Nandan, Ap, Chandrababu, Cmjagan, Janasena, Pawan Kalyan, Renu Desa

ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ని( Renu Desai ) కూడా ఈ ఉచ్చులోకి లాగి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయించడానికి చూస్తున్నారు.రీసెంట్ గా ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రేణు దేశాయ్ ని అధికార పార్టీ కి సంబంధించిన ఒక వెబ్ సైట్ తాలూకు జర్నలిస్ట్ మీరిద్దరూ విడిపోవడానికి కారణం మీ మధ్య వచ్చిన విభేదాలేనా?, లేకపోతే మూడవ వ్యక్తి వల్ల విడాకులు( Divorce ) తీసుకున్నారా అని అడుగుతాడు.అప్పుడు రేణు దేశాయ్ అతనికి దిమ్మ తిరిగే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది.

ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు, ఈ అంశాల పై మాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని అడుగుతాడు రేణు దేశాయ్ ని చూస్తూ ఉంటే ఎదో విధంగా ఆమెని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడించే ప్రయత్నం చెయ్యాలని అధికార పార్టీ చూస్తుంది.ఈ ఉచ్చులో రేణు దేశాయ్ చిక్కుకుంటుందా, లేదా తెలివిగా తప్పించుకుంటుందా అనేది చూడాలి.

Telugu Akira Nandan, Ap, Chandrababu, Cmjagan, Janasena, Pawan Kalyan, Renu Desa

ఒకవేళ పవన్ కళ్యాణ్ గురించి ఆమె పొరపాటున తప్పుగా మాట్లాడితే కొడుకు అకిరా నందన్( Akira Nandan ) భవిష్యత్తు మీద బలమైన ప్రభావం పడుతుంది.ఇప్పటికే రేణు దేశాయ్ కి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి నెగటివిటీ ఉంది.ఇంకా నెగటివిటీ పెంచుకుంటూ పోతే కొడుకు భవిష్యత్తుకు ప్రమాదం.మరి రాబోయే రోజుల్లో ఆమె వీటిని ఎలా ఎదురుకుంటుంది అనేది చూడాలి.గతం లో కూడా ఆమె ప్రభుత్వ మీడియా ఛానల్ ట్రాప్ లో పడి, పవన్ కళ్యాణ్ గురించి నోరు జారింది.దానిని అధికార పార్టీ వాళ్ళు ఇప్పటికీ వాడుకుంటున్నారు.

ఇప్పుడు రేణు దేశాయ్ మళ్ళీ అలాంటి స్టఫ్ ఇవ్వబోతుందా అనేదే ప్రశ్న.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube