స్కూలుకు వెళ్లే ముగ్గురు మైనర్ బాలికలకు డబ్బు ఆశ చూపించి ఓ వృద్ధుడు దాదాపు మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు.అయితే ఆ మైనర్ బాలికలు అనారోగ్యానికి గురి కావడంతో ఆ వృద్ధుడి పాడు బుద్ధి వెలుగులోకి వచ్చింది.
దీంతో ఆ బాలికల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.జగిత్యాల జిల్లా( Jagityala District ) తిర్మాలాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ పిల్లలు రంగధాముని పల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదు, నాలుగు, మూడో తరగతి చదువుతున్నారు.
ఈ మైనర్ పిల్లల తండ్రులు డబ్బు సంపాదించడం కోసం గల్ఫ్ వెళ్లారు.వీరి తల్లులు కూలీ పనులు చేస్తూ వీరి ఆలనా పాలన చూస్తున్నారు.
అయితే వీరి సామాజిక వర్గానికే చెందిన శివరాత్రి ముత్తయ్య( Shivratri Muttiah ) (65) అనే వృద్ధుడు, ఈ మైనర్ పిల్లలు ఉండే ఇంటి సమీపంలోనే ఉంటాడు.

స్కూలుకు సెలవు ఉండే సమయంలో ఈ మైనర్ పిల్లలకు డబ్బు ఆశ చూపించి పొలం వద్దకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఇలా దాదాపు మూడు నెలలుగా ఆ పిల్లలపై తన కామ వాంఛ తీర్చుకుంటున్నాడు.అయితే ఆ చిన్నారులు నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు.
వీరి తల్లులు ఏం జరిగిందని కాస్త గట్టిగా ఆరా తీయగా ఆ వృద్ధుడు చేసిన నిర్వాకం బయటపడింది.పంచాయితీ కోసం కుల సంఘం లోకి పిలిస్తే ఆ వృద్ధుడు రాకపోవడంతో పాటు.
వీరి కుటుంబాలపై బెదిరింపులకు పాల్పడ్డాడు.దీంతో ఆ మైనర్ బాలికల తల్లులు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంచాయితీ కోసం సంఘం దృష్టికి తీసుకెళ్లగా.ముత్తయ్య రాకపోవడంతో పాటు ముత్తయ్య భార్య మల్లవ్వ, అతని కొడుకు శ్రీనివాస్ తమనే బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.