Nupur Sanon: ఆమె నటన అంటే చాలా ఇష్టం.. టైగర్ నాగేశ్వర్ రావు హీరోయిన్ కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కృతి సనన్(Kriti Sanon) ఒకరు.ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Tiger Nageswara Rao Actress Nupur Sanon Revealed Her Favorite Heroine-TeluguStop.com

ఇక ఈమె స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తన చెల్లి నుపూర్ సనన్(Nupur Sanon) కూడా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేశారు.ఈమె త్వరలోనే రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswararao) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా అక్టోబర్ 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Actressnupur, Anushka Shetty, Keerthy Suresh, Nupur Sanon, Nupursanon, Ra

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.రవితేజ గారితో(Ravi Teja) పని చేయడం తనకు ఎంతో సంతోషంగా అనిపించింది అని తెలిపారు.ఈ సినిమా చేయడానికి కంటే ముందుగా రవితేజ గారు నటించిన సినిమాలన్నింటినీ కూడా తాను చూసానని తెలియచేశారు.

రవితేజ గారు హిందీ బాగా మాట్లాడటం వల్ల షూటింగ్ సమయంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగలేదని తెలియజేశారు.కెరీర్ మొదట్లో తెలుగు సినిమాలను పెద్దగా చూసేదాన్ని కాదు కానీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న సమయం నుంచి తెలుగు సినిమాలను కూడా చూస్తున్నానని తెలిపారు.

Telugu Actressnupur, Anushka Shetty, Keerthy Suresh, Nupur Sanon, Nupursanon, Ra

ఇక మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు అనే ప్రశ్న కూడా తనకు ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతా తనకు సాయి పల్లవి(Sai Pallavi) అంటే చాలా ఇష్టమని తెలిపారు.ఈమె నటన ఎంతో అద్భుతంగా నుపూర్ సనన్ తెలిపారు.సాయి పల్లవి తో పాటు అనుష్క శెట్టి,( Anushka Shetty ) కీర్తి సురేష్( Keerthy Suresh ) అంటే కూడా తనకు ఇష్టమని వీరంతా కూడా కథ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో ఒదిగిపోయి నటిస్తారు అంటూ ఈమె తనకు ఇష్టమైనటువంటి హీరోయిన్స్ గురించి తెలియచేశారు.

ఇక ఈ సినిమాలో తాను సారా అనే మార్వాడి అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తెలియచేశారు.కొంచెం కొంచెం హిందీ మాట్లాడుతూ ఉంటుంది.తన మనసుకు నచ్చిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయి పాత్రలు తాను నటించానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube