తెలంగాణలో అట్టడుగు స్థానంలో ఉన్న బిజెపి బండి సంజయ్ ( BJP MP.Bandi Sanjay ) ఎంపీగా గెలిచి, రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఉప్పంగే కెరటంలా ఎగిసిపడింది.దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీ ఇచ్చేది బిజెపి అనే పరిస్థితికి వచ్చింది.ఇదే తరుణంలో బిజెపిలోకి చాలామంది కీలక నేతలు కూడా చేరారు.అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వివేక్ వెంకటస్వామి( Vivek Venkataswamy) , విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్.ఇలాంటి బడా నాయకులు బిజెపిలో చేరడంతో ఒకానొక సమయంలో బిజెపి గ్రాఫ్ హైయెస్ట్ స్థాయికి చేరిపోయింది.
ఇక బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా తొలగిపోయారో, అప్పటినుంచి కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా నైరాశ్యం నెలకొంది.

ఇంతలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, ఢిల్లీ నాయకులు వచ్చి కాంగ్రెస్ లో మరింత జోష్ పెంచడంతో తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) ను ఎదుర్కొనేది కాంగ్రెస్సే అనే పరిస్థితికి వచ్చింది.దీంతో బీజేపీలో చేరినటువంటి సీనియర్ నాయకులు కొంతమంది బిజెపిలో భవిష్యత్తు లేదనుకుంటున్నారట.అంతేకాకుండా బిజెపి అధిష్టానం ఆ నాయకులను కనీసం పట్టించుకోవడం లేదట.
ఇక వారు చేసేదేమీ లేక పార్టీ నుంచి జంప్ అవుదామని చూస్తున్నట్టు తెలుస్తోంది.మరి ఆ నాయకులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
వివేక్ వెంకటస్వామి ఈయన రాజకీయంగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి, ఏ పార్టీలో నిలకడగా ఉండలేదు.ముందుగా కాంగ్రెస్ (Congress) లో,ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.
మళ్లీ బిఆర్ఎస్ నుంచి బిజెపిలో, ప్రస్తుతం ఈ పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.ఆయనతో పాటుగా విజయశాంతి( Vijayashanti ), రాజగోపాల్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, కూడా బిజెపిని వదిలి కాంగ్రెస్ వైపు రావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే తరుణంలో వారు చర్చించుకొని నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.వీరు బిజెపి నుంచి బయటకు వెళ్లాలనుకోవడానికి ప్రధాన కారణం బిజెపి అధిష్టానం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదట.అమిత్ షా లాంటి పెద్ద నాయకులు ఈటల రాజేందర్ ( Etela Rajender ) కి ప్రాధాన్యత ఇస్తూ, మొన్నటికి మొన్న జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్ మీటింగ్ లో కూడా వీరిని కనీసం పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్నారట.దీంతో వీరంతా కలిసి ముకుమ్మడిగా పార్టీ మారాలని చర్చించుకున్నట్టు తెలుస్తోంది.