టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ కావడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు.టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.
వేల కోట్లలో అవినీతి చేశారని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గట్టి నాయకుడు లేడనే చెప్పుకోవచ్చు.
ఆర్థిక నేరాల కేసుల్లో బెయిల్ రావడం కొంచెం కష్టమనే తెలుస్తోంది.ఇటువంటి సమయంలో టీడీపీని నడిపించేంది ఎవరనేది అందరిలో ప్రశ్నార్థకంగా మారింది.
చంద్రబాబు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం కన్పించడం లేదని తెలుస్తోంది.లోకేశ్ పార్టీని, క్యాడర్ ను నడపలేడు.
ఇక నందమూరి బాలయ్య ఆయన జనంలోకి వెళ్తే క్యాడర్ సైతం భయపడి పారిపోతారనే విమర్శలు వస్తున్నాయి.ఇలా అయితే పార్టీ ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని భావించిన చంద్రబాబు పాత చుట్టం, దత్తపుత్రుడు పవన్ ను పిలిపించారని, అదే నిన్నటి ములాఖత్ కు కారణమని ఏపీ ప్రజలు అనుకుంటున్నారట.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును గురువారం ములాఖత్ లో భాగంగా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిశారు.అనంతరం బయటకు వచ్చిన తరువాత పవన్ ఒక్కరే మీడియాతో మాట్లాడారు.
రానున్న రోజుల్లో తామంతా కలిసి నడుస్తామని, జగన్ అరాచక పాలనను సమిష్టిగా ఎదుర్కొంటామంటూ మాట్లాడారు.అయితే సముద్రం ఒకరు ముందు తలవంచదు.
తుఫాను ఎన్నడూ యాచించదు అని గతంలో భారీ డైలాగ్స్ చెప్పిన జనసేనాని ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు మోకరిల్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
నిజానికి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి స్పందన లేదు.
సానుభూతి వస్తుందని ఎదురుచూసినా అది కలనేనని అర్థం అయింది.ఇన్నాళ్లకు అవినీతి పరుడికి తగిన శిక్ష పడిందని పలువురు అంటున్నారే తప్ప అయ్యో అని మాత్రం అనడం లేదని సమాచారం.
అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి పవన్ మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు.రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన జనసేనాని అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీపై ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించారు.దీనిపై ఏపీ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గత పదేళ్లుగా టీడీపీతో కలిసే ఉన్న పవన్ కొత్తగా మరోసారి కలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
టీడీపీ, జనసేన పొత్తుల నేపథ్యంలో కాపు యువతను బలి చేసేందుకు రంగం సిద్ధమైందని అర్థం అవుతోంది.
ఎందుకంటే పొత్తులతో చంద్రబాబు కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని జనసేనాని తీసుకువచ్చారని పలు విమర్శలు వస్తున్నాయి.రెండు భుజాల మీద రెండు పార్టీల జెండాలు పట్టుకుని జనసైనికులు యుద్దం చేయాలా అంటే అవుననే సంకేతాలు ప్రస్తుతం ఏపీలో కన్పిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.
ఇంతా చేస్తే అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారన్నది ప్రశ్నార్థకమే.
మొదటి నుంచి మన కాపులు.
మన అస్తిత్వం అని ఆశతో ఉంటూ వస్తున్న కాపు నాయకులూ, యువతకు సీట్లు దక్కుతాయా ? అసలు పొత్తులో భాగంగా మీకెన్ని సీట్లు అని విలేకరి అడిగిన ప్రశ్నకు అదంతా తరువాత చూద్దాం.ముందైతే కలిసి పని చేద్దాం అని సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కే సీట్ల గురించి క్లారిటీ లేనపుడు జన సైనికులకు మాత్రం ఏమి అంచనా ఉంటుంది.ఈ పరిస్థితులన్నింటినీ బట్టి కాపు యువతను పవన్ బలి చేసేందుకు సిద్ధం అయ్యారనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయని తెలుస్తోంది.
ఒక సమయంలో చంద్రబాబును విమర్శించిన పవన్ ఇప్పుడు మద్ధతు తెలిపి పొత్తు ప్రకటించడం బట్టి పవన్ ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు అన్న సంగతి క్లియర్ కట్ గా అర్థం అవుతుందని కొందరు చెబుతున్నారు.కుంభకోణం విషయాన్ని పక్కదోవ పట్టించడానికే పొత్తుల విషయాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.
అయితే మరోవైపు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మళ్లీ తాము సింగిల్ గానే పోటీ చేస్తామని అంతేకాకుండా అధికారంలోకి కూడా వస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.