సంగీతం అనే పేరు చెబితే చాలు చాలామంది కి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఎడాపెడా అర్థం కాని రీతిలో సౌండ్ చేయడం తప్ప వినసొంపుగా ఉండడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఈమధ్య రిలీజ్ అయినా జవాన్, విక్రమ్ ,జైలర్( Jawan, Vikram, jailer ) సినిమాలు మనం చూసుకున్నా కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే సినిమాలు విజయం సాధించే విధంగా ఉన్నాయి అంతేకానీ ఆ సినిమాల్లో వచ్చిన పాటలు మాత్రం ఒక్కటి కూడా ఎవరికి గుర్తుంటే ఆస్కారం లేదు అంతలా ఆ పాటల విషయంలో ఇప్పటి దర్శకులు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు.
కానీ ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళితే పాటలు బాగుండి కూడా సినిమాలు విజయవంతం అయ్యేవి.సినిమాల్లో పాటలు ముందుగా విడుదలై అవి జనాలకు చేరి వాటి ద్వారానే సినిమా థియేటర్కు ప్రేక్షకులు వచ్చేవారు పాటలతో హిట్టు కొట్టి మ్యూజికల్ హిట్స్( Musical hits ) గా నిలిచిన సినిమాలు కోకల్లలు ఉన్నాయి.కానీ ఈ ఒరవడి రాను రాను తగ్గుతూ వస్తుంది అసలు సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో ఎందుకు వస్తున్నాయో పోతున్నాయో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు.
పైగా అర్థరహితమైన లిరిక్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేని సంగీత వాయిద్యాలు ఇవి ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తున్నాయి.
గతంలో పనిచేసిన కీరవాణి, ఎస్ఐ రాజకుమార్, ఇళయరాజా( Keeravani, SI Rajakumar, Ilayaraja ) వంటి సంగీత దర్శకులు ప్రతి సందర్భానికి తగ్గట్టుగా పాటలు పెట్టి అవి ఎంతో వినసొంపుగా ఉండే విధంగా బాణీలు కట్టేవారు ఉత్సాహం ఇప్పటి సంగీత దర్శకుల్లో పూర్తిగా కొరవడింది అని చెప్పుకోవచ్చు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటే చాలు ఎలా ఉన్నా పరవాలేదు అనే విధంగా ప్రస్తుతం సినిమాలు వస్తున్నాయి.ఇదేవిధంగా మరికొన్ని రోజులు లేదా మరికొన్ని నీళ్లు ముందుకు వెళితే పాటలకు చెల్లు చీటీ వచ్చినట్టే.
పాటలు పూర్తిగా లేని సినిమాలు కూడా వస్తున్నాయి తరుణంలో సంగీత దర్శకులు సింగర్స్ కి కచ్చితంగా మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉండదు.