ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో చలిని నివారించడానికి చాలా మంది ప్రజలు స్వెటర్లు( Sweaters ) ధరిస్తూ ఉంటారు.ఇది వేడిగా అనిపిస్తూ ఉంటుంది.
శరీరం నుంచి విడుదలయ్యే వేడి కూడా బయటకు రానివ్వదు.చాలా మంది స్వెటర్లు వేసుకొని ఇంట్లో నిద్రపోవడం మనం తరచుగా చూస్తూ ఉంటాము.
అయితే ఈ చిన్నపాటి అజాగ్రత్త ఆరోగ్యానికి హాని చేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ చల్లగా ఉన్న సమయంలో రక్తనాళాలు తగ్గిపోతాయి.
స్వెటర్లు లేదా వెచ్చని దుస్తులు ధరించడం వల్ల మీ శరీరం వెచ్చగా ఉంటుంది.కానీ కొన్నిసార్లు ఇది ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ రక్తపోటు ( blood pressure )వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.అంతే కాకుండా చర్మానికి దద్దుర్లు వంటి అలర్జీ కూడా సంభవించవచ్చు.చర్మం మృదువుగా ఉండడానికి, ఎలర్జీ వచ్చే అవకాశాలు తగ్గించడానికి స్వెటర్ ధరించే ముందు మంచి నాణ్యమైన బాడీ లోషన్ ఉపయోగించడం మంచిది.సాధారణ దుస్తుల కంటే స్వెటర్స్ కాస్త మందంగా ఉంటాయి.
వాటి మధ్య నుంచి గాలి కూడా సరిగ్గా వెళ్ళదు.చలి ఎక్కువగా ఉన్నప్పుడు స్వెటర్ తో పాటు దుప్పట్లు కూడా కప్పుకుంటూ ఉంటారు.
వెచ్చని దుస్తులు కూడా ధరిస్తూ ఉంటారు.స్వెటర్ వెచ్చదనం, దుప్పటి వెచ్చదనం డయాబెటిక్ రోగులకు ముఖ్యంగా గుండే సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రమాదకరమైనదని ఒక అధ్యయనములో తెలిసింది.
అందుకే కొందరు స్వెటర్లు వేసుకుని నిద్రించడాన్ని నిరాకరిస్తున్నారు.ఉన్ని దుస్తులు ధరించడం వల్ల శరీరంలోని వేడి బయటకు రాకుండా ఉంటుంది.దీని వల్ల బిపి, మధుమేహ వ్యాధిగ్రస్తుల ( Diabetics )సమస్యలు గణనీయంగా పెరుగుతాయి.వెచ్చని దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల ఆక్సిజన్ సరిగ్గా అందదు.అటువంటి పరిస్థితిలో మీకు ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది.ఇది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కలిగిస్తుంది.
ఉన్ని చేతి తొడుగులు ధరించి నిద్రించడం కూడా హానికరమే అని నిపుణులు చెబుతున్నారు.ఇవి ధరిస్తే చెమట ఎక్కువగా వస్తుంది.
దీనివల్ల చర్మంపై బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.