హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.వైద్యం పేరుతో నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగరానికి చెందిన ఓ యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది.
అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో యువతిని అత్తమామలు బండ్లగూడలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు.ఈ క్రమంలో యువతి కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించిన బాబా అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
ఈ విషయం బయటకు రావడంతో నిందితుడు పరార్ అయ్యాడు.అయితే ఇదే విషయాన్ని అత్తమామలకు చెప్పిన పట్టించుకోలేదని, తనకు దెయ్యం పట్టిందని ఇంటిలోనే బంధించారని బాధిత యువతి ఆరోపిస్తుంది.
ఈ క్రమంలోనే తల్లిదండ్రుల సాయంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.