బాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా ( BGMI )ను భారతీయ గేమర్లకు పరిచయం చేసిన సంస్థ క్రాఫ్టన్.తాజాగా ఈ కంపె డిఫెన్స్ డెర్బీ అనే కొత్త టవర్ డిఫెన్స్ మొబైల్ గేమ్‌ను ఇండియాలో విడుదల చేసింది.
ఈ గేమ్ యాపిల్ యాప్ స్టోర్, ఆండ్రాయిడ్‌లోని గూగుల్ ప్లే స్టోర్, శామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.ఆండ్రాయిడ్ గేమ్ డేటా సైజు 500ఎంబీ లోపే ఉంటుంది.
డిఫెన్స్ డెర్బీ( Defense Derby ) ఒక స్ట్రాటెజీ గేమ్.ఇది BGMI బ్యాటిల్ రాయల్-స్టైల్ గేమ్‌ప్లేకు చాలా భిన్నంగా ఉంటుంది.ఇందులో ఆటగాళ్ళు 4-ప్లేయర్ PvP బాటిల్స్‌లో ఒకరితో ఒకరు పోటీపడతారు. బాటిల్ గ్రౌండ్( Battle Ground )లో వ్యూహాత్మకంగా యూనిట్లను ఉంచడం ద్వారా టవర్‌ను రాక్షసుల నుంచి రక్షించడం గేమ్ యొక్క లక్ష్యం.
ఆటగాళ్ళు వివిధ యూనిట్ల నుంచి ఎంచుకోవచ్చు, ప్రతి ఒక్కటి వారి సొంత ప్రత్యేక సామర్థ్యాలతో వీటిని సెలెక్ట్ చేయవచ్చు.
గేమ్ డెర్బీ మోడ్, బ్లిట్జ్ మోడ్, వ్యాలీ ఆఫ్ ట్రయల్స్ మోడ్, ఫ్రెండ్లీ డెర్బీ మోడ్, థీమ్డ్ మోడ్, బ్యాన్ పిక్ మోడ్, క్వెస్ట్ మోడ్‌తో సహా అనేక రకాల గేమ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది.ప్రతి మోడ్ విభిన్నమైన సవాలును అందిస్తుంది, కాబట్టి ఆటగాళ్ళు తమ నైపుణ్య స్థాయికి సరిపోయేదాన్ని కనుగొనగలరు.డిఫెన్స్ డెర్బీ అనేది ఒక ఆహ్లాదకరమైన, సవాలు చేసే టవర్ డిఫెన్స్ గేమ్, ఇది అన్ని వయసుల ప్లేయర్లను కచ్చితంగా ఆకర్షిస్తుంది.
గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఆడటానికి ఉచితం, కాబట్టి దీనిని ఒక సారి ట్రై చేయవచ్చు.ఇక క్రాఫ్టన్( Krafton ) కింద ఉన్న స్వతంత్ర స్టూడియో అయిన రైజింగ్ వింగ్స్ ఈ గేమ్‌ను అభివృద్ధి చేసింది.