టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఇలియానా( Heroine Ileana ) తనను అభిమానించే అభిమానులకు అదిరిపోయే తీపికబురు అందించారు.పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇలియానా వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఇలియానా తన కొడుకు ఫోటోను షేర్ చేయడంతో పాటు తన కొడుకు పేరును సైతం అభిమానులకు వెల్లడించడం గమనార్హం.ఇలియానా చెప్పిన శుభవార్త అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

ఆగష్టు నెల 1వ తేదీన తాను మగబిడ్డకు జన్మనిచ్చానని ఆమె పేర్కొన్నారు.తన కొడుకుకు కోవా ఫీనిక్స్ డోలన్( Koa Phoenix Dolan ) అని పేరు పెట్టానని ఆమె అన్నారు.నా కొడుకును ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు కలుగుతున్న సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని ఇలియానా వెల్లడించారు.ఈ విషయం తెలిసిన అభిమానులు ఇలియానా కొడుకు క్యూట్ గా ఉన్నాడని అచ్చం తల్లి పోలికే అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
కొడుకు( Ileana Baby Boy ) పుట్టడంతో తన మనస్సులు సంతోషంతో నిండిపోయాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా తన పెళ్లి గురించి, కొడుకుకు సంబంధించిన ఇతర విషయాల గురించి మాత్రం వెల్లడించలేదు.
ఇలియానా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.మరోవైపు తెలుగులో ఈ గోవా బ్యూటీకి సినిమా ఆఫర్లు తగ్గాయి.

గత నెలలో ప్రియుడి ఫోటోలను( Ileana Husband ) పంచుకున్న ఇలియానా అతనికి సంబంధించిన ఇతర విషయాలను మాత్రం వెల్లడించలేదు.త్వరలో ఇలియానా మరిన్ని శుభవార్తలు చెబుతారని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాలను రివీల్ చేస్తారని అభిమానులు ఫీలవుతున్నారు.భవిష్యత్తులో తెలుగులో ఈ హీరోయిన్ మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అప్పట్లోనే కోటి రూపాయల పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించిన స్టార్ హీరోయిన్ ఇలియానా రీఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.







