జొన్న పంటలో చిగుర్లు తినే ఈగలను అరికట్టే పద్ధతులు..!

జొన్న పంట( Sorghum crop )లో చిగుర్లను తినే ఈగలు గెనుస్ అథెరిగొన జాతికి చెందినవి.ఈ ఈగలు జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

 Methods To Prevent Flies That Eat Shoots In Sorghum Crop ..! ,dead Heart , Flie-TeluguStop.com

ఆడ ఈగలు జొన్న మొక్క కాండంపై, మొక్క మొదళ్ళ వద్ద ఉన్న నేలపై తరచుగా గుడ్లను పెడుతుంటాయి.కొత్తగా పుట్టిన లార్వాలు సిలిండర్ ఆకారంలో తెల్లగా ఉంటాయి.

ఇవి మొక్కల పైకి ఎగబాగుతూ లేత మొక్కల చిగుర్లను నమ్మి లేస్తాయి.

ఈ ఈగలు లేత మొక్కల చిగుర్లను ఆశించి చిన్న, గుండ్రంగా కత్తిరించి తినేస్తాయి.క్రమంగా మొక్క ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి వేలాడిపోయి, మొలకలలో ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.ఈ ఈగల నుండి పంటకు హాని కలుగకుండా ఉండాలంటే.

తెగులు నిరోధక విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.ధరగా విత్తనాలను నాటడం వల్ల ఈగల అధిక జనాభా నుండి లేత మొలకలను రక్షించుకోవచ్చు.

లేదంటే చాలా ఆలస్యంగా నాటడం వల్ల డెడ్ హార్ట్( Dead Heart ) లక్షణాలను నివారించవచ్చు.పంట పొలంలో కలుపులను నివారిస్తూ సరైన సమతుల ఎరువులను ఉపయోగించాలి.

జొన్న మొక్కలు మొలకెత్తిన తర్వాత దిబ్బ ఎరువును పొలంలో ఉపయోగించకూడదు.క్రమం తప్పకుండా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.

నీటి తడిని రాత్రిపూట కాకుండా పగటిపూట ని అందించాలి.

మొక్కల మధ్య, వరుసల మధ్య దూరం ఉంటే వివిధ రకాల తెగులు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.సూర్యరశ్మి( sunshine ), గాలి బాగా తగలడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.అధిక ప్రాధాన్యం సేంద్రియ ఎరువులకే ఇవ్వాలి.

పెరిథ్రోయిడ్ కీటక నాశినిలు ఉపయోగించడం వల్ల తొలి దశలోనే ఈగల జనాభా పూర్తిగా నియంత్రించబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube