ఏపీ అధికార పార్టీ వైసిపి జనసేన మధ్య హోరాహోరీగా మాటలు యుద్ధం జరుగుతోంది.వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే కాకుండా , రోడ్లు, అవినీతి వ్యవహారాలు, అలాగే వాలంటీర్ వ్యవస్థ పైన సంచలన విమర్శలు చేశారు .ప్రజల డేటాను వాలంటీర్లు సేకరించి వాటిని దుర్వినియోగం చేస్తున్నారని, ఏపీలో పెద్ద ఎత్తున మహిళలు అదృశ్యం కావడం వెనుక వాలంటీర్ల హస్తం ఉంది అంటూ పవన్( Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమరాన్ని రేపాయి.ఈ వ్యాఖ్యలకు వైసిపి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది .అయినా పవన్ వెనక్కి తగ్గకుండా ఈ విమర్శలు చేస్తూనే వస్తుండడంతో ఏపీ ప్రభుత్వం( AP Government ) కీలక నిర్ణయం తీసుకుంది.పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయనపై కోర్టులో కేసు వేసేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేయడం మరింత సంచలనంగా మారిపోయింది.
ఈ జీవో జారీ అయిన వెంటనే పవన్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.ప్రజల కోసం ప్రాణాలు పోయినా పర్లేదని , ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, తనను అరెస్టు చేసి హింసించుకోండి అంటూ పవన్ వ్యాఖ్యానిస్తూ మైలేజ్ పొందే ప్రయత్నం చేశారు.అయితే పవన్ పై ప్రభుత్వం కేసు వేయాలనే ఆలోచనకు రావడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని వైసీపీ కీలక నాయకులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ కేసు వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని పవన్ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారని, ప్రజల కోసం తాను పోరాడుతుంటే , కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొంది అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు.పవన్ పై కేసు వేయాలనుకుంటే వాళ్ళే వాలంటీర్( Volunteer ) తోనైనా, లేక థర్డ్ పార్టీ చేతో కేసు పెట్టించాలి కానీ, నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగి జీవో ఇవ్వడం జనసేనకు రాజకీయంగా మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే వాదన తెరపైకి వస్తోంది.
అసలు కోర్టులో ప్రభుత్వ వాదన నిలబడుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది.అయితే మరి కొంత మంది వైసీపీ నాయకుల వాదన మరోలా ఉంది.ఇది కోర్టులో నిలబడుతుందో లేదో తెలియదు గాని , వాలంటీర్ వ్యవస్థపై చులకన భావంతో చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళతాయని, ఇక ముందు ముందు వాలంటీర్ వ్యవస్థ పై ఎవరూ చులకన భావంతో విమర్శలు చేయకుండా ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.