బీజేపీ విషయంలో వైసీపీ ( YCP )వెనక్కి తగ్గుతోందా ? బీజేపీతో పోరుకు దిగితే తమకే నష్టమని వైసీపీ భావిస్తోందా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునేమో అనే సమాధానం కలుగక మానదు.సాధారణంగా వైసీపీపై గాని జగన్ పై గాని ఎవరైనా విమర్శలు చేస్తే ఆ పార్టీ నేతలు వెంటనే కౌంటర్ అటాక్ చేస్తుంటారు కానీ ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి( AP BJP chief Purandeshwari ) చేసిన విమర్శలకు వైసీపీ నుంచి పడ్డగా కౌంటర్స్ వినిపించలేదు.
దీంతో ఇదే ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చకు తావిచ్చింది.ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్( jagan ) పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు వేసుకుంటున్నాడని, రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్ప రాష్ట్రం ఎక్కడ రోడ్లు వేసిందో చెప్పాలని జగన్ సర్కార్ పై హాట్ హాట్ విమర్శలు చేశారు పురందేశ్వరి.
అంతే కాకుండా పోలవరం( Polavaram ) పూర్తి చేయలేకపోతే కేంద్రనికి అప్పగించాలని, కేంద్ర నిధులన్నీ జగన్ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నారని.ఇలా చాలా రకాల విమర్శలే చేశారు.అయితే పురందేశ్వరి చేసిన విమర్శలకు వైసీపీ నుంచి పెద్దగా ప్రతి విమర్శలు వినిపించలేదు.
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ( YCP MP Vijaya Sai Reddy )ట్విట్టర్ లో అరకొర కౌంటర్స్ వేసే ప్రయత్నం చేశారు తప్పా.ఇంకెవరు పెద్దగా స్పందించలేదు.
దీనికి కారణం ఏమైఉంటుందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీపై వైరం పెంచుకోవడం కన్నా సైలెంట్ గా ఉండడమే మంచిదని వైసీపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అందుకే బీజేపీ విషయంలో పెద్దగా రియాక్ట్ అవడం లేదని తెలుస్తోంది.కాగా ఆ మద్య ఏపీకి వచ్చిన బీజేపీ పెద్దలు జగన్ పాలనపై ఘాటైన విమర్శలు చాలానే చేశారు.కానీ జగన్ మాత్రం బీజేపీ తమతో లేదనే ఒక్క మాట తప్పా బీజేపీ పై ఇంకెలాంటి విమర్శలు చేయలేదు.
నిజానికి కేంద్ర ప్రభుత్వంపై చాలా విషయాల్లో జగన్ విమర్శించాల్సి ఉంది.ప్రత్యేక హోదా విషయంలోనూ, పోలవరం నిధుల విషయంలోనూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant )ప్రయివేటీకరణ విషయంలోనూ.
ఇలా చాలా అంశాల్లో బీజేపీ పై విమర్శలు ఎక్కుపెట్టవచ్చు.కానీ వైసీపీ మాత్రం అలా చేయడం లేదు.దీన్ని బట్టే చూస్తే బీజేపీ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గుతోందనేది స్పష్టంగా అర్థమౌతోంది.